టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ప్రసంగం
• ఈ రోజు తెలుగుదేశం ప్రాగణమంతా మాదిగలతో నిండి ఉంది
• తిని తినక పోయినా క్రమశిక్షణకు మారుపేరు నామాదిగ జాతి.
• మండుటెండలను లెక్కచేయకుండా వచ్చారంటే….నేను మాదిగ తెలుగుదేశం మాదిగల పార్టీ అని చెప్పడానికి ఉదే ఉదాహరణ
• తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మనందరి ప్రియతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయటానికి వచ్చాం.
• గతంలో సామాజికంగా దగపడ్డ జాతికి న్యాయం చేయాలని వర్గీకరణ కోసం సోదరుడు మంద కృష్ణ ఉద్యమం చేశారు.
• ఆ ఉద్యమ ఫలితాలు నాలుగు సంవత్సరాలు అనుభవించాం అది మనందరికి తెలుసు.
• తెలుగుదేశం పార్టీ లో మాదిగలు మళ్లీ కీలక పాత్ర పోషించడం జరుగుతుంది.
• మా ఉనికిని మేము కాపాడుకొవడానికి మాకు తెలుగుదేశం పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడుని కోరాం.
• మాదిగలకు కీలక పదవులు ఇవ్వాలి.
• జీవో నెం.25 నూటికి నూర్లుపాళ్లు అమలు చేయాలని చంద్రబాబు నాయుడుని కోరాం.
• ఆయన దానికి అంగీకరించి వర్గీకరణకు సహకరిస్తామని చెప్పారు
• కార్పొరేషన్ల విషయంలో కూడా మాదిగలకు పెద్దపీట వేస్తానని చెప్పడంతో మనము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ మహా కార్యక్రమం ఏర్పాటు చేశాం
• మాదిగలంతా ఐక్యంగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలి.
• మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ తప్ప వేరే రాజకీయ పార్టీ లేదు
• ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు నాయుడు హయాం వరకు పార్టీలో మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తూనే ఉన్నారు.
• రాబోయే ఎన్నికల్లో కురుక్షేత్రంలా మాదిగలు ముందుండి పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడిలా ముందుండి తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలి
• రాష్ట్రంలో నా మాదిగ జాతికి అన్యాయం చేసిన జగన్ రెడ్డి అంతు చూద్దామని కదిలి వచ్చిన నా మాదిగ జాతికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.