Suryaa.co.in

Andhra Pradesh

శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికలు-దేశం క్యాడర్లో నూతన ఉత్సాహం..

– జీ.వికి పెరిగిన మైలేజ్
వినుకొండ:-శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయలు ఎన్నికలు ప్రకటించినప్పటి నుండి పోలింగ్ ముగిసే వరకు అన్నీ తానై తెలుగుదేశం అభ్యర్థి పారా హైమావతి విజయానికి అహర్నిశలు కృషిచేశారు.
రెండున్నరేళ్ల వైసిపి అధికారం తర్వాత వచ్చిన శావల్యాపురం by poll దేశం పార్టీ కి కలిసి వచ్చింది. ఒకనాడు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న శావల్యాపురంలో ఎన్నికల్లో క్యాడర్ నూతన ఉత్సాహంతో పని చేశారు.
గెలుపుపై ధీమాతో ఉన్నారు
స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సొంత మండలం అయినప్పటికీ పార్టీలో క్యాడర్ ఏ మాత్రం తగ్గకుండా హైమావతి విజయానికి కృషి చేసి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు.
ఏ గ్రామంలో చూసినా కూడా నువ్వా – నేనా అన్న పోటీ నెలకొని ఉంది.
ఎమ్మెల్యే బొల్లా సొంత గ్రామమైన వేల్పూరులో హైమావతి అనుకూలంగా మార్చేందుకు మండల నాయకత్వం, గ్రామ నాయకత్వ కృషి స్పష్టంగా కనిపించింది. ఆ గ్రామంలో టిడిపి 1000 వరకు మెజార్టీ సాధిస్తుందని ధీమాతో ఉన్నారు. అన్ని గ్రామాల వారీగా అంచనాలు వేసుకుంటూ గెలుపుపై భరోసాతో టిడిపి క్యాడర్ జోష్ గా ఉంది.
ఎన్నికల మొదలైనప్పటి నుండి ప్రచారంలో అధికార పార్టీకి ఏమాత్రం తగ్గకుండా ఒత్తిళ్లకు సైతం తగ్గకుండా తెలుగుదేశం క్యాడర్ బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అన్న ఆనందం కనిపిస్తుంది. అధికార పార్టీకి ధీటుగా జిల్లా రాష్ట్ర నాయకత్వం లను మండలం ప్రచారంలో ముందు నుంచి వ్యూహాత్మకంగా సక్సెస్ అయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అధికార వైసిపి వ్యతిరేక ఓటును అనుకూలంగా మలుచుకోవడంలో టిడిపి ఎక్కడ వెనకడుగు వేయలేదు అని కూడా నాయకత్వం హ్యాపీ మూడ్లో ఉన్నారు. టిడిపి అభ్యర్థి హైమావతి జెడ్పీటీసీ గా ఎన్నిక అయితే జిల్లాలోనే ఓ పెద్ద సంచలనం ఏకైక టిడిపి సభ్యురాలుగా జిల్లా పరిషత్ లో ప్రతిపక్ష పాత్ర పారా హైమావతి దక్కే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఏది ఏమైనా అధికార వైసిపి అభ్యర్థి సీనియర్ నేత చుండూరు వెంకటేశ్వర్లు కు దివంగత టీడీపీ దివంగత నేత పార హైమ రావు సతీమణి హైమావతి మధ్య పోటీ నువ్వా – నేనా అన్నట్లు జరిగింది.
గెలుపు ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. అయినప్పటికీ ఎన్నికల్లో తెలుగుదేశం క్యారెక్టర్ చేసిన కృషి, పనితీరు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కు మైలేజ్ తీసుకురావడంతో పాటు క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పక తప్పదు.

LEAVE A RESPONSE