వైసీపీ పాలనలో నియోజకవర్గానికొక మైనింగ్ డాన్ తయారయ్యాడు

-జగన్ రెడ్డి కనసున్నల్లో అక్రమ మైనింగ్ తో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు
-విశాఖలో వృద్దుల భూమి కబ్జా చేయటం దుర్మార్గం
-జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు విశాఖపట్నాన్ని కబ్జాల పట్నంగా మార్చారు
-టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, బుద్దా వెంకన్న

వైసీపీ పాలనలో అక్రమ మైనింగ్ యదేచ్చగా జరుగుతోందని, వైసీపీ నేతలు నియోజకవర్గానికొక మైనింగ్ డాన్ లా తయారయ్యి వేల కోట్లు దోచుకుంటున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ…పల్నాడు ప్రాంతంలో గురజాల, మాచర్ల నియోజక వర్గాల ఎమ్మేల్యేల కనుసన్నల్లో యదేచ్ఛగా గత మూడున్నరేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. దీనిపై అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోలేదు.

గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ వాటాలలో పొత్తు కుదరక వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి రోడ్డు మీద పడి ఎలా కొట్టుకున్నారో మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. గురజాలలో కాసు మహేష్ రెడ్డి ఆద్వర్యంలో అక్రమ మైనింగ్ , అరచాకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అనధికారికంగా గురజాలలో ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్, ఇరిగేషన్ భూములలో 2వేల ఎకరాలపైగా అక్రమ మైనింగ్ కి పాల్పడి రూ. 5 కోట్లు అక్రమార్జన చేస్తున్నారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతిపై కాసు మహేష్ రెడ్డి ప్రధాన అనుచరుడు దాడికి పాల్పడ్డాడు.

సామాజిక న్యాయభేరి పేరుతో రాష్ట్రమంతా తిరగిన వైసీపీ నాయకులు సొంత పార్టీ బీసీ మహిళా నేతపై జరిగిన దాడిని ఎందుకు ఖండించలేదు? ఇదేనా జగన్ రెడ్డి చెప్పే సామాజిక న్యాయం ? పేరుకే బిసిలకు పదవులు ఇచ్చి పెత్తనం అంతా జగన్ రెడ్డి సామాజికవర్గం వారిదే. దాచేపల్లిలో మైనింగ్ లో పని చేసినందుకు కూలీ డబ్బులు అడిగిన ఆరుమంది వడ్డెర కార్మికులను కత్తులతో పొడిచారు. వారిలో 21 ఏళ్ళ నీలకంఠ బాబు అనే వ్యక్తి చనిపోయారు. దీనిపై మేము నిరసన తెలిపితే టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని నోరు పారేసుకున్నారు. కానీ వడ్డెర కార్మికులని కత్తులతో పొడిచింది వైసీపీకి చెందినవారేనని మీ పార్టీ నేత రేవతి కూడా చెప్పింది.

మీరు చేసిన తప్పులని మేము బయట పెట్టడం కాదు, మీ నాయకులే బయట పెట్టే పరిస్థితి కొచ్చారు. వడ్డెర కార్మికులు మైనింగ్ లో జీవించే ప్రాథమిక హక్కు ఉందని గతంలో చెప్పాం. అధికారంలోకి రాకముందు వడ్డెర కార్మికులని అందలం ఎక్కిస్తాం అని చెప్పి నేడు వారిని పక్కన పెట్టడమే కాకుండా వారి మీద అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నారు. వైసీపీ చేసిన అక్రమ మైనింగ్ గుంతలలో పడి ఏడుగురు పిల్లలు చనిపోయారు. పులి సంతోష్ కుమార్, చంపల్లి మహేష్, షేక్ నాగుర్ హుస్సేన్ తుమ్మల చెరువు హైస్కూల్ పక్కన వైసీపీ చేసిన అక్రమ మైనింగ్ గుంతలలో పడి చనిపోయారు. దాచేపల్లి మండలం, నారాయణపురం క్వారీలో వేముల సాంబశివరావు, తంగెడ గ్రామంలో చింతపల్లి రశీద్ 10వ తరగతి స్టేట్ టాపర్, శ్రీనివాసపురం పొందువుల బొజ్జా మనయ్య, కనకం మాధవా అక్రమ మైనింగ్ గుంతలలో పడి చనిపోయారు. చనిపోయిన పిల్లల తల్లిదండ్రుల ఘోష ఎవరు పట్టించుకుంటారు? కనీసం ప్రభుత్వం ఆ కుంటుంబాలని ఆదుకొని ఆర్థిక సాయం చేసిందా?

వైసీపీ చేసిన పాపాలకు పిల్లల ప్రాణాలు బలిఅయ్యాయి. అక్రమ మైనింగ్ కు అడ్డు వస్తున్నారని ఇప్పటికే 9 మందిని గురజాలలో, మాచర్లలలో 5 మందిని చంపారు. పల్నాడు , ఆంధ్రప్రదేశ్ మీ అయ్య, తాతల జాగిరా? అక్రమాలు చేసి అక్రమార్జన చేయడం, అడ్డు వచ్చిన వారిని చంపుకుంటూ వెళ్లడం, మహిళలపై అత్యాచారాలు చేయడం ఇదేనా వైసీపీ పాలన? వైసీపీ అరాచకాలకు గ్రామాలను వదిలిపెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేటికి రాలేని పరిస్థితి. ఛలో ఆత్మకూరు అని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే పోలిసులు హడావిడిగా వదిలి పెట్టారు. కానీ మళ్లీ యధావిధిగా పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి పొరుగు గ్రామాలకు తరిమేస్తున్నారు. గురజాలలో 2వేల ఎకరాల ప్రభుత్వ భూములకు దొంగ పట్టాలు సృష్టించి బ్యాంకులకు తనఖా పెట్టి రూ. 5 వందల కోట్లు రుణాలు తీసుకున్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కనుసన్నల్లో యధేచ్ఛగా తెలంగాణ మద్యం, గుట్కా, గంజాయి అక్రమణ రవాణా, పేకాట, క్యాసినో, వ్యభిచారం వంటి అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. మాచర్ల, పల్నాడు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, జగన్ రెడ్డి జాగీరు అన్న చందంగా బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలేమైనా మీ సొంత పత్రికలలో, సిమెంటు ఫ్యాక్టరీలలో పని చేసే వాళ్లమనకుంటున్నారా? వైసీపీ నేతలు తాత్కాలిక అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా బరితెగించి మాట్లాడుత్నారు.

కుటుంబ సభ్యులని, మహిళలని కూడా రాజకీయాలలోకి లాగి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు. కొడాలి నాని, గోరంట్ల మాధవ్ ఎవరైనా నోరు పారేసుకోకుండా వళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. మీది తాత్కాలికమైన అధికారం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ఓడిపోక తప్పదు. కులం పేరు ఎత్తితో చెప్పు చూపించమన్న మీకు చెప్పు మాత్రమే చూపిస్తే సరిపోదు, చూపించవలసిన చాలా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు చూపించాల్సినవి చూపిస్తాం. చాలా మంది నియంతలు కాల గర్భంలో కలిసిపోయారు. దీన్ని వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి. హిట్లర్, అలెగ్జాండర్ కన్నా జగన్ రెడ్డి ఏమైనా గొప్పోడా?

వైసీపీ అరచకాలు, అక్రమాలని ప్రజలంతా అడ్డుకోవాలి. ఇది ఒక్క టీడీపీకి, చంద్రబాబు నాయుడుకి సంబంధించింది కాదు. దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాద్యత ప్రజలందరిపై ఉంది. వేల కోట్ల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా మారే పరిస్ధితి తెచ్చారు. శ్రీలంక అధ్యక్షుడిలా జగన్ రెడ్డి రాష్ట్రాన్ని వదిలి పెట్టి పారి పోయే పరిస్థితి వచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగంలో రాజారెడ్డి రాజ్యంగం అమలు చేస్తామంటే కుదరదు. పల్నాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై విచారణ జరిపాలి, వైసీపీ నేతలు దోచుకున్న వేలకోట్లు రివకరీ చేయాలి. వైసీపీ పాలనలో బిసిలపై జరుగుతున్న దాడుల్ని బీసీలంతా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

బుద్ధా వెంకన్న మాట్లాడుతూ…..
2014లో హుద్ హుద్ తుఫాను వల్ల అతలాకుతలం అయిపోయిన విశాఖ నగరం మళ్లీ కోలుకోవడానికి సుమారు 30 సంవత్సరాలు పడుతుందని భావించారు. కానీ నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు బస్సులో నిద్రించి మరీ అక్కడ పరిస్ధితుల్ని చక్కబెట్టి 3 నెలలలో అతర్జాతీయ స్ధాయిలో విశాఖపట్నాన్ని అద్భుత పట్నం అనే రీతిలో తీర్చిదిద్దారు. కానీ 2019 లో నరకాసురుడు రూపంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజల పాలిట దాపురించాడు. 2014 లో ఎన్నికలలో జగన్ రెడ్డి తల్లిని విశాఖపట్నం ప్రజలు ఓడించారని ఆ ప్రాంతం పై కక్ష్య కట్టి విశాఖపట్నంని కబ్జాల పట్నంగా మార్చారు. వై.యస్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి రూ. 43వేల కోట్లు దోచుకున్నారు.

నాడు దీనికి ప్రణాళిక రచించిన విజయసాయి రెడ్డిని ఉత్తారాంధ్ర ఇన్ ఛార్జీగా పంపి దోపిడీకీ తెరతీశారు. దోచుకోవడంలో మాస్టర్ మైండ్ విజయసాయి రెడ్డిది. ఉత్తరాంధ్రలో అక్కడి ప్రజలు విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డికి ట్యాక్స్ లు కట్టాల్సిన పరిస్థితి. విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి కలిసి వేలాది ఎకరాలు విశాఖపట్నంలో కబ్జా చేశారని అనేక కథనాలు సామాజిక మాధ్యమాలలో వచ్చాయి. భూ కబ్జాల గురించి వైసీపీ అనుకూల పత్రికలలో కూడా ప్రచురితమయ్యాయి.

దశాబ్దన్నర కిందట విశాఖలో వృద్ధుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని జగన్ రెడ్డి తన బినామీలకు కట్టబెడుతున్నారు. వృద్ధుల కోసం ఉచితంగా ఆశ్రమం నిర్మించేందుకు హయగ్రీవ సంస్థకు 2006లో ఎండాడ సర్వే నంబర్‌ 92లోని 12.5 ఎకరాలను 92/3గా సబ్‌ డివిజన్‌ చేసి, అప్పట్లో ఎకరా రూ.45 లక్షలు చొప్పున అప్పటి ప్రభుత్వం కేటాయించింది. కేటాయించిన భూమిలో 10 శాతంలో వృద్ధాశ్రమం నిర్మాణం, మౌలిక వసతులకు 30 శాతం భూమి పోను మిగిలిన 60 శాతం భూమిని దరఖాస్తులో పేర్కొన్న హామీ మేరకు వృద్ధులకు విక్రయించేలా భవనాల నిర్మాణానికి వినియోగించాలని నిబంధన విధించింది. కానీ ప్రస్తుతం ఆ భూమిని వ్యాపార కోణంలో వినియోగించుకొనేలా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఆ భూమిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేటాయింపులు రద్దు చేసే అవకాశాన్ని పరిశీలించాలంటూ స్వయంగా జిల్లా కలెక్టరే నివేదిక ఇచ్చారు.

నిర్మాణాల కోసం పెట్టుకున్న దరఖాస్తును జీవీఎంసీ షార్ట్‌ ఫాల్‌లో పెట్టారు. జీవీఎంసీ అనుమతిలు లేకుండా, ఏన్ వోసీ లేకుండా అక్రమంగా వైసీపీ పెద్దల అండతో దర్జాగా ‘హయగ్రీవ’ల్యాండ్స్ లో నిర్మాణాలు జరిగిపోతున్నాయి.అక్కడి మట్టిని సమీపంలో వున్న బ్లైండ్‌ స్కూల్‌ వెనుక ప్రభుత్వ భూమిలో డంపింగ్‌ చేస్తున్నారు. గనుల శాఖ అనుమతి లేకుండా పట్టపగలే వాహనాలతో గ్రావెల్‌ను తరలిస్తున్నారు. దీని వెనుక స్ధానిక వైసీపీ ఎంపీతో పాటు వైసీపీ నేత, విశాఖపట్నం స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు ఉన్నారు.

వైసీపీ పాలనలో విశాఖపట్నంలో గంటకో ఘోరం, అరగంటకో కబ్జా జరుగుతోంది. వైసీపీ నేతల ధన దాహానికి అడ్డూ, అదుపు లేకుండా పోయింది. గురజాలకు 2014 నుంచి 2019 వరకు ఎమ్మేల్యేగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. ఇప్పటి వైసీపీ నాయకులు పిన్నెళ్లి రామకృష్ణ మీద నాడు యరపతినేని శ్రీనివాసరావు కన్నెర్ర చేసుంటే ఆ ప్రాంతంలో తిరగగలిగేవారా. వైసీపీ నేతలు పాదయాత్రలు, బస్సు యాత్రలు చేయగలిగేవారా? మేము ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్తున్నాం. మీరు దానికి విరుద్ధంగా ప్రజలు 151 సీట్లు ఇచ్చారన్న అహంకారంతో ఏం చేసిన చెల్లుతుందున్నట్టు బరితెగించి ప్రవర్తిస్తున్నారు.

అక్రమాలు, అరచాకాలు చేసి సంపాదించిన డబ్బంతా జగన్ రెడ్డి ఏం చేస్తున్నారు? విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్ మీద రోజుకో ట్వీట్ పెడతారు. వినే వాడు వెర్రి వెంగళప్ప అయితే పంది కూడ మహాభారతం చెబుతుందన్నట్టు విజయసాయి రెడ్డి ట్వీట్లు ఉంటాయి. 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న విజయసాయిరెడ్డి సిగ్గు శరం లేకుండా నీతి నిజాయితీల గురించి మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి పై పన్నెండు 420 కేసులు నమోదైన తరువాత వైసీపీ ఆవిర్భవించింది. అందులో 840 లు కొడాలి నాని, గోరంట్ల మాధవ్ లు కులాల పేరుతో రాజకీయ పబ్బం గడపుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీ కన్నా గొప్ప నాయకులని తయారు చేసిన ఘనత ఆయనది.

గోరంట్ల మాధవ్ తన రాజీనామాను మోహానా విసిరి కొడతానని మాట్లాడుతున్నారు. మీరేమన్నా పడటానికి మేమైనా మీ పత్రికలో, సిమెంటు ఫ్యాక్టరీలో పని చేసే సిబ్బంది కాదు, తెలుగుదేశం కార్యకర్తలం. చంద్రబాబు నాయుడు నీతి, నిజాయితీ, నైతిక విలువలతో ప్రజలకు మంచి చేయాలని టీడీపీని నడుపుతున్నారు. కనుక మేం వైసీపీ దుర్మార్గాలపై పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటాలు మాకోసం కాదు, ప్రజల కోసం. విశాఖపట్నంలో ఎక్కడ ఏఘోరం జరిగిన చెప్పుకోవడానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఫోన్ చేసిన వెంటనే సకాలంలో వస్తాం.

గోరంట్ల మాధవ్ ఘనటపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప, సిఐడి చీఫ్ సునీల్ అధికార పార్టీ ప్రతినిధులులాగా మాట్లాడటం సిగ్గుచేటు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ రెడ్డి బటన్ నొక్కుతాడు. వైసీపీ ఎమ్మేల్యేలు, ఎంపీలు ప్రజల ముందు బట్టలు ఊడడీసి తిరుగుతున్నారు. విశాఖలో వృద్థాశ్రమానికి ఇచ్చిన భూమిలో వృద్ధాశ్రమాన్నే నిర్మించాలి. ఆ భూములని ఎవరైనా కొనుక్కున్నా టీడీపీ అధికారంలోకి రాగానే అక్కడ వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తాం. దీనిపై టీడీపీ తరపున చంద్రబాబు నాయుడు నిజనిర్థారణ కమిటీని నియమిస్తారు.

నిజనిర్ధారణ అంటే లింగ నిర్థారణ అనే తీరులో కొడాలి నానికి కోపం వస్తుంది. గోరంట్ల మాధవ్ కి క్లీన్ చిట్ ఇచ్చిన కొడాలి నాని అతన్ని తన ఇంటికి పిలిచి తన కుటుంబ సభ్యులతో జోజనం చేయలగరా? వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని బరితెగించి ప్రవర్తిస్తున్నవారికి, అక్రమాలు అరచకాలు చేస్తున్న వారిని వదలిపెట్టేది లేదని బుద్దా వెంకన్న వైసీపీ నేతల్ని హెచ్చరించారు.

Leave a Reply