కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మోడీ వరం

మోడీ అద్భుతమైన పథకాన్ని ఈరోజు ప్రవేశపెడుతున్నారు. కరోనా కారణంగా అభాగ్యులు అయినా పిల్లలకు ఆర్థిక పుష్టి కల్పించేందుకు తల్లి తండ్రిని కోల్పోయి అనాధలైన పిల్లలకు ఒక పెద్ద అన్నగా నరేంద్రమోడీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

కరోనా కారణంగా 2020 మార్చి నుండి 2022 ఫిబ్రవరి వరకు కరోనా కారణంగా తల్లి, తండ్రి ఇద్దరిని కోల్పోయిన పిల్లల కోసం మరియు తల్లి గాని తండ్రి గాని తల్లి గాని గతంలోనే మరణించి ఉన్నా ప్రస్తుతం కరొనా కారణంగా తల్లి లేక తండ్రి మరణించినా, లేదా దత్తత తీసుకున్న సంరక్షకులు చనిపోయిన పీఎం కేర్ కింద పాస్ పుస్తకం ,మరియు ఆయుష్మాన్ భారత్ వైద్య భీమా కార్డు, మరియు18 సంవత్సరములు నిండే సరికి వారి పేరు మీద 10 లక్షల రూపాయలు డబ్బును కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇరవై మూడు సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు వారికి వడ్డీ వస్తుంది. 23 సంవత్సరాలు నిండిన తర్వాత వారు 10 లక్షల రూపాయలను వారు వాడుకొనవచ్చును. పూర్తి హక్కులు వారికే.

ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. ఇందులో జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయము కానీ, వైయస్సార్ ఆరోగ్యశ్రీ కి గాని సంబంధం కానీ లేనేలేదు. కావున అర్హులైన పిల్లలందరూ ఏవైనా కరొనా కారణంగా మరణించిన సర్టిఫికెట్లు, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాని, స్థానిక సంస్థల నుండి గాని తెచ్చుకోవాల్సిన మరణ ధ్రువ పత్రము లాంటి సర్టిఫికెట్లు ఉంటే ముందుగానే తెచ్చుకొని మీ దగ్గర ఉంచుకో వలసినదిగా కోరుచున్నాను .

పై పథకం ఆన్లైన్లో” పి ఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ “అనే పోర్టల్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది . పై విషయాలను మీ దగ్గర స్నేహితులకు, బంధువులకు, మీ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎక్కువ ప్రచారం కల్పించి వీలైనంత ఎక్కువ మంది అర్హులకు ఈ పథకం అందేటట్టు గా మన వంతు కృషి మనము చేయవలసిందిగా మిమ్మల్నందర్నీ కోరుకుంటున్నాను.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877