Suryaa.co.in

Andhra Pradesh

మంత్రినే అయినా పార్టీ కార్య కార్య కర్తనని చెప్పుకోడానికి గర్వపడతా

-ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి
-నియోజకవర్గ ప్లీనరి సమంవేశంలో మంత్రి అమర్ నాథ్ వెల్లడి

అనకాపల్లి, జూన్ 28: ఇచ్చిన వాగ్దానులను తు. చ. తప్పకుండా అమలు చేస్తూ, రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మీద ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, దానికి వత్తాసు పలుకుతున్న మరో పార్టీ నిత్యం విమర్శిస్తునే ఉన్నారని, ఆ విమర్శలను తిప్పి కొట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పిలుపునిచ్చారు. అనకాపల్లి నియోజక వర్గ ప్లీనరి సమావేశంలో మంగళవారం స్థానిక పెంటకోట కళ్యాణమండపంలో జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అమర్ నాధ్ మాట్లాడుతూ తను మంత్రి నే అయినా పార్టీ కార్యకర్తనని చెప్పుకోడానికే గర్వపడ తాను అన్నారు. వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ శ్రేణులు ఎంత కష్టపడ్డారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదని అన్నారు. వైఎస్ రాజ శేఖరెడ్డి మరణించిన అనంతరం జగన్మోహనరెడ్డిని పలు పార్టీలు ఎంత ఇబ్బంది పెట్టినా వారిని ఎదిరించి నిలదొక్కుకున్నారని మంత్రి అమర్ నాధ్ చెప్పారు. దేశంలో సోనియాగాంధీని ఎదిరించి న మొనగాడు జగన్ అని అన్నారు.మరణా నంతరం ఆ రాష్ట్రంలో, దేశంలో ఉన్న పలు పార్టీలు జగన్మోహన రెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టినా తండ్రి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీని కూడా తొక్కపెట్టి పార్టీ నెలకొల్పి, 8నెలల్లో అధికారంలోకి వచ్చారని చెప్పారు.

జగన్మోహనరెడ్డిని జైలుక పార్టీని సమాధి చేయాలని కాంగ్రెస్ కుట్రలన్ని 16 నెలలు జైలుకు పంపించారని, అయినా ధైర్ఘ్యంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించారు అని అమర్ నాధ్ చెప్పారు. విశాఖ మాజజిల్లా సర్వతో ము ముఖాముభివృద్ధికి జగన్ చర్యలు తీసుకుంటుంటే, ప్రతి పక్షనేత చంద్ర బాబు అట్టుకుంటున్నారని అన్నారు. ఎవరెన్ని. పన్నగాలు పన్నినా, విశాఖకు పరిపాలను రాజధాని తరలిరావడం ఖాయమని మంత్రి అమర్ నాధ్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయని, త్వరలో ఈ ప్రాంతంలో 70 ఎకరాల్లో ఆటోనగర్ నెలకొల్పబోతున్నామని
ఆయన తెలియ చేశారు.

చంద్ర బాబు సీఎంగా ఉన్నప్పుడు విశాఖలో మూడుసంవత్సరాలు మూడో పారిశ్రామిక సదస్సులు నిర్వహించారని, కనీసం ఒక్క పరిశ్రమనైనా తేగలిగారా అని మంత్రి అమర్ నాధ్ ప్రశ్నించారు. అదే జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో 15 వేలకోట్లు రూపాయల పెట్టుబడులుపై అగ్రిమెంట్ చేశా రని అన్నారు. వెనకడుగు వేయకుండా జగన్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, స్వతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఈవిధంగా చేసారా ? అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహనరెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న అయ్యన్న పాత్రుడు తన పద్థతి మార్చికోపోతో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని మంత్రి అమర్నాథ్ హెచ్చరించారు.

వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ జగన్ మోహనరెడ్డి స్వతహాగా ఎదిగిన సాయకుడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాబును ఎవ్వరూ ఓడించనవసరం లేదని ఆయన కుమారుడే అతనిని. ఓడిస్తాడని అన్నారు. మరో పాతికేళ్లు జగన్ రాష్ట్రానికి సీఎంగా వుండాలని వీరభద్రరావు ఆకాంక్షించారు. పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ధర్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ప్లీనరి జరిగేటప్పటి నాటికి, గ్రామ , వార్డు కమిటీలు సిద్ధంగా ఉండాలని, వాటిని సెంట్రల్ కమిటి ఆమోదానికి పంపుతామిని ప్లీనరి, మరుసటి రోజే వాటికి ఆమోదం చేయిస్తామని అన్నారు . ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఇస్తామన్నారు.

అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా వాలంటీర్లు సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందించామని చెప్పారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ మాట్లాడుతూ పార్టీని కింది స్థాయినుంచి బలోపేతం చేసే విషయాన్ని స్థాయి ప్లేనరీలో జగన్మోహనరెడ్డి సూచనలు ఇస్తారని చెప్పారు. పార్టీ పరిశీలకులు సతీష్ వర్మ మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలకన్నా పదిరెట్ల అమలు చేశారని చెప్పారు. పార్టీపరిశీలకులు ముక్కామహలక్ష్మీ నాయుడు, మట్లాడుతూ నవరత్నాలను లబ్ధిదారులు ఊహించిన దానికన్నా ఎక్కువగా మంజూరు చేస్తున్నారని చెప్పారు. అనకా ల్లి ఎం.పి పి సూరి బాబు,కశింకోట మండల పార్టీ అధ్యక్షులు గొల్లవల్లి శ్రీనివాసరావు, చొక్కాకుల వెంకటరావు, దాడి జయవీర్కా ర్పొరేటర్లు నీలిమ, సునీత, ప్రసన్న లక్ష్మి , సౌజన్య, భీశెట్టి సత్యవతి, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ పలకా యసోద తదితరులు ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి అనకాపల్లి టౌన్ ప్రెసిడెంట్ జానకి రామరాజు అద్యక్షత వహించారు.

LEAVE A RESPONSE