ముంబయి: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ)కి చెందిన హెలికాప్టర్ ఒకటి అరేబియా సముద్రంపై అత్యవసరంగా దిగింది.అందులో ఆరుగురు సిబ్బందిని కాపాడగా.. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఓఎన్‌జీసీకి చెందిన ఆరుగురు సిబ్బంది, ఒక కాంట్రాక్టర్, ఇద్దరు పైలట్లతో వెళ్తోన్న హెలికాప్టర్ ఒకటి ఓఎన్‌జీసీ రిగ్‌కు సమీపంలో అరేబియా సముద్రంపై అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు కంపెనీ ట్విటర్‌లో వెల్లడించింది. హెలికాప్టర్‌కు ఉన్న ఫ్లోటర్ల సాయంతో దిగినట్లు తెలిపింది. సమాచారం తెలియగానే, ఓఎన్‌జీసీ సహాయక చర్యలు చేపట్టింది. రిగ్ నుంచి సహాయక బోట్లను పంపించింది. అటు భారత తీర దళం కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో చేరింది.
ఇప్పటివరకు హెలికాప్టర్ నుంచి ఆరుగురిని కాపాడినట్లు ఓఎన్‌సీజీ తెలిపింది. మిగతా వారిని కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. అయితే హెలికాప్టర్ ఎందుకు అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చిందన్న వివరాలపై మాత్రం స్పష్టత లేదు. అరేబియా సముద్రంలో ఉన్న నిల్వల నుంచి చమురు, గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు ఓఎన్‌జీసీ ఈ సముద్రంలోనే అనేక రిగ్‌లు, ఇన్‌స్టాలేషన్లను ఏర్పాటు చేసింది.
Helicopter crash Near ONGC oil Rig In sea.All 9 survivors rescued.4 survivors picked by OSV Malviya 16, 1 by boat of Sagar Kiran oil rig & 2 each by #IndianNavy ALH & Seaking helicopters.4 critical survivors being evacuated to Juhu by Navy helicopters for management at hospital pic.twitter.com/fCdez3boZP
— Mrityunjay Singh मृत्युंजय सिंह (@MrityunjayNews) June 28, 2022