Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు

పోలవరం (ఏలూరు జిల్లా) : జలవనరుల శాఖామాత్యులుగా పదవి చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్టు సందర్శన ఇదే తొలిసారి. ఈ సందర్బంగా మంత్రి అంబటి రాంబాబును శాసన సభ్యుడు తెల్లం బాలరాజు, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఓ.ఆనంద్,ఆర్డీవో ఝాన్సి రాణీ మర్యాద పూర్వకంగా కలిసి పూల బోకెలను అందజేసి స్వాగతం పలికారు. తొలుత మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ జంటగుహలు, హెడ్ రెగ్యులేటర్ లను పరిశీలించారు.

అనంతరం స్పిల్ వే, ఫిష్ ల్యాడర్, పవర్ హౌస్,తూర్పుగోదావరి జిల్లా గొందూరు నేలకోట జంటగుహలు పరిశీలించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా అంగులూరు వద్ద ఉన్న గ్యాప్ 1, గ్రౌటింగ్
ambati పనులను, దిగువ కాపర్ డ్యామ్ పనులను పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా వైపు ఎర్త్ కం రాక్ పిల్ ఇన్ డ్యాం డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాంతాలను, స్పిల్వే గ్యాప్ 3 కాంక్రీట్ పనులు, రేడియల్ గేట్ల అమరిక పనులు పరిశీలించారు. స్పిల్ వే పై ఏర్పాటుచేసిన గ్యాలరీలో ఫొటో ఎగ్జిబిషన్ ను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు.

ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆయా నిర్మాణాల పనుల ప్రగతి,తదితర అంశాలను ఈ ఎన్ సి సి. నారాయణ రెడ్డి,సిఇ సుధాకర్ బాబు మంత్రివర్యులకు వివరించారు. మంత్రి వెంట పోలవరం శాసన సభ్యులు తెల్లం బాలరాజు , శాసన సభ్యులు సింహాద్రి రమేష్,అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ యం.వి.ఎస్.నాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, పోలవరం ప్రాజెక్టు అడ్మనిస్ట్రేటర్ ఆనంద్, ఆర్డీవో ఝాన్సి రాణీ,యంపిపీ సుంకర వెంకట రెడ్డి, అగ్రికల్చర్ మిషన్ సభ్యులు బి.రామారావు,స్టేట్ రైతు విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.త్రినాధ్ రెడ్డి, సైట్ మెగా పోలవరం ఇంచార్జి, యం. ముద్దుకృష్ణ, మెగా యం.డి పి. వి. కృష్ణారెడ్డి, మేనేజర్ పి.మురళీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE