-నా మతం మంచిది, నీది కాదు అనే వాళ్లు బుద్ది తక్కువ వాళ్ళే
-కేసిఆర్ వచ్చాక తెలంగాణలో పండగలకు గౌరవం వచ్చింది
-క్రిస్టియన్లకు నూతన వస్త్రాల పంపిణీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
(పాలకుర్తి నియోజకవర్గం, డిసెంబరు 22):”నా మతం మంచిది, నీ మతం మంచిది కాదు అంటూ.. మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టేవాళ్లు ఉంటారు. దేశంలో కూడా ఇలాంటి చిచ్చు పెట్టి, అధికారంలోకి వచ్చామని తెలంగాణలో కూడా ఈ తగాదాలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు” అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీలకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అందిస్తున్న నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రిగారు నేడు పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాల్గొని క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు కొత్త దుస్తులను అందించి, కేక్ కట్ చేసి, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఫాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి శుభాశీస్సులు అందించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు… క్రిస్మస్ 8 ఏళ్ల కింద ఎలా అయ్యింది? ఇపుడు ఎలా అవుతుంది?మనందరం ఆలోచించాలి.తెలంగాణ రాకముందు ఎవరి చర్చిలో వారే పండగ చేసుకునేది. సర్పంచ్, అధికారులు పట్టించుకోకపోయేది. కానీ సీఎం కేసీఆర్ వచ్చాక ప్రభుత్వమే జోక్యం చేసుకుని క్రిస్మస్ పండగ చేస్తుంది.గ్రామాల్లో సర్పంచులు ముందుండి పండగ చేయాలని చెబుతున్నాం.
మతాలలో చిచ్చు పెట్టేటోల్లు ఉంటారు..నా మతం మంచిది, నీది కాదు అనే వాళ్లు బుద్ది తక్కువ వాళ్ళే.భగవంతుడు వివిధ రూపాల్లో పుట్టాడు.బిజెపి పార్టీ మెజారిటీ వారిని రెచ్చగొట్టి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. అలా అనుకుంటే ప్రపంచంలో ఎవరూ మెజారిటీ ఉన్నారు.?
ఎవరిని కించ పరచవద్దు. కేసిఆర్ వచ్చాక ప్రతి పండగకు గౌరవం వచ్చింది.చర్చిలు, మసీదులకు ఎమ్మెల్యే ఫండ్ పెట్టుకునే అధికారం సీఎం కేసీఆర్ వచ్చాక ఇచ్చారు.చర్చిలలో ఇబ్బందులు ఉంటే చెప్పండి.. వాటిని బాగు చేద్దాం.
ఫాస్టర్లు ఎస్సీలు ఉన్నారు. దళిత బంధు, ఇళ్లు పెట్టిస్తాను. మీరు కూడా కేసిఆర్ ని మరిచి పోవద్దు. ఆయన వచ్చాకే రాష్ట్రం ముందుకు పోతుంది. వేరే రాష్ట్రాలు, దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి.30 కోట్ల రూపాయలతో బట్టలు పెట్టి, విందు ఇచ్చి క్రిస్మస్ పండగ చేస్తున్నారు. పాపాలు చేసినోళ్లు కూడా కార్లల్లో తిరుగుతారు..కానీ అది తాత్కాలికం.. వాళ్ల పిల్లలు గోస పడుతారు.
కానీ పుణ్యం చేసినవాళ్లకు వెంటనే మంచి జరగకపోయినా… వారి పిల్లలు బాగుపడతారు.కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలి..ధైర్యం చెప్పాలి అదే మానవత్వం.మా నాన్న మంచి చేశాడు కాబట్టే నాకు అక్కరకు వచ్చింది. నేను మంచి చేస్తే నా పిల్లలకి మంచి జరుగుతుంది.ప్రభువును ఆదర్శంగా తీసుకోవాలి.
35 ఏళ్ల కింద ఇజ్రాయిల్ పోయాను. దోస్తులు క్రీస్తు సమాధి దగ్గరకు పోదాం అన్నారు. ఎందుకో పోయాము. కానీ అక్కడ ఉండాలి అనిపించి, రెండు రోజులు అక్కడే ఉన్నాను. అందుకే 7సార్లు గెలిచాను.ఏదో ఒక మతంలో ఉండు..కానీ అందరినీ గౌరవించు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివ లింగయ్య ఫాస్టర్ ఆనంద్, ఎంపీపీ నాగిరెడ్డి జెడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచ్ ఏకాంత రావు, తదితరులు పాల్గొన్నారు.