Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాం

జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.  గుమ్మనూరు జయరాంకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు.

ఈ క్రమంలో, గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ… టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE