బీసీల ద్రోహి జగన్ రెడ్డి

• నా బీసీ, నా బీసీ అని మాట్లాడటానికి నీకు ఏం అర్హత ఉంది జగన్ రెడ్డి ?
• టిడిపి జనసేన బీసీ డిక్లరేషన్ సభలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్

రాష్ట్రంలోని బీసీలంతా టీడీపీ, జనసేనతోనే ఉన్నారు . ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీల కోసం ఒక్క కొత్త పథకమైనా ప్రవేశపెట్టారా? ఆదరణ, పెళ్లికానుక, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు ఎందుకు రద్దు చేశాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 10 శాతం కోత పెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి.బీసీలను టీడీపీ –జనసేన సొంత బిడ్డల్లా చూస్తుంటే వైసీపీ సవతి ప్రేమ చూపిస్తోంది.బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించిన నమ్మకద్రోహి జగన్ రెడ్డి.తన కూతుళ్లే విదేశాల్లో చదువుకోవాలనే స్వార్ధంతో బీసీలకు విదేశీ విద్య పథకాన్ని రద్దు చేశాడు.

బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారు .ఎంపీ పదవి కోసం ఆర్. కృష్ణయ్య …బీసీల ఆత్మ గౌరవాన్ని , భవిష్యత్ ను జగన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టాడు.

Leave a Reply