Suryaa.co.in

Andhra Pradesh

పేదల జబ్బులకు చెల్లించాల్సిన డబ్బుని కూడా మింగేసిన వైసీపీ దొంగలు

• ఆరోగ్యశ్రీ సొమ్ము స్వాహాపై వైద్యారోగ్యశాఖ మంత్రి మౌనం దేనికి సంకేతం?
• ప్రభుత్వాసుపత్రుల్లో కుక్కకాటు.. పాము కాటు ఇంజక్షన్లు లేవుగానీ.. బయట విచ్చలవిడిగా డ్రగ్స్.. పాన్ పరాగ్.. గుట్కా ప్యాకెట్లు లభిస్తున్నాయి
• ఆసుపత్రుల్లో వైద్యసిబ్బంది.. మందులు.. వైద్య పరికరాలు లేకుండా పేదలకు గొప్ప వైద్యం ఎలా అందుతుందో ముఖ్యమంత్రి చెప్పాలి
•మొత్తం బడ్జెట్లో రూ.58వేలకోట్లు వైద్యసేవలకోసం కేటాయించామన్న ముఖ్యమంత్రి ఆ సొమ్ము ఎటుపోయిందో, ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలి
• వైసీపీ పందికొక్కులు నకిలీ రోగుల్ని సృష్టించి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తో కుమ్మక్కై ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యానికి అందాల్సిన వేలకోట్లు కాజేశాయి
• గుంటూరు, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో జరిగిన దోపిడీ గురించి పత్రికల్లో కథనాలు వచ్చినా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు స్పందించలేదు?
• ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన జగన్ రెడ్డి సిగ్గులేకుండా జగనన్న సురక్ష.. విలేజ్ హెల్త్ క్లినిక్ అని గొప్పులు చెప్పుకుంటున్నాడు.
— టిడిపి అధికార ప్రతినిధి డా.సప్తగిరి ప్రసాద్

శవాలపై చిల్లర ఏరుకున్న తీరుగా జగన్ రెడ్డి సర్కార్ ప్రజారోగ్యాన్నికూడా అవినీతి వనరుగా మార్చుకుందని, రాష్ట్ర వైద్యరంగాన్ని తాకట్టు పెట్టి డబ్బులు దండుకునే దుస్థితికి దిగజార్చిందని, ముఖ్యమంత్రి డబ్బాలు కొట్టుకుంటున్న ఆరోగ్య శ్రీ అస్తవ్యస్తంగా తయారైందని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలి పారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.

“కుక్క కాటుకు అవసరమైన టీకాలు ఇవ్వలేని జగన్ సర్కార్, రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. పాము కాముకు మందులేదుగానీ… పాన్ పరాగ్ లు…గుట్కాలు మాత్రం విచ్చలవిడిగా లభిస్తున్నాయి. రాష్ట్రంలోని ఆసుపత్రులు..ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలన్నీ పతనావస్థకు చేరాయి. తమప్రభుత్వం రూ2.80లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించిందని, వైద్యసేవలకోసం రూ.58వేలకోట్లు కేటాయించామని జగన్ రెడ్డి గొప్పలు చెబుతున్నాడు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిరంజీలు.. దూది కూడా లేక వైద్యసిబ్బంది ప్రజలకు వైద్యం అందించలేక చేతులెత్తేస్తుంటే ప్రభుత్వం కేటా యించిన నిధులు ఏమయ్యాయి..ఎటు పోయాయి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరో గ్యశ్రీ పథకం కింద ప్రతిరోగికి భోజనానికి రోజుకి రూ.100లు మాత్రమే ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఆ సొమ్ముతో పేదవాడికి మంచి పౌష్ఠికాహారం ఎలా లభి స్తుందో చెప్పాలి. 2010 నుంచి నేటివరకు ఆరోగ్య శ్రీ డైట్ ఛార్జీలు పెంచకపోతే, రోగులకు నాణ్యమైన ఆహారం ఎలా అందుతుంది? ప్రభుత్వాసుపత్రుల్లోని రోగుల కంటే జైల్లోని ఖైదీలకే మంచి ఆహారం లభిస్తోంది.

జగన్ రెడ్డి గొప్పగా చెబుతున్న ఆరోగ్యశ్రీ కింద ఏ ఆసుపత్రిలో, ఎందరు రోగులకు రూ.25 లక్షల వైద్యసేవలు అందాయో వైద్యఆరోగ్యశాఖ మంత్రి చెప్పాలి
జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రధాన ఆసుపత్రుల్లో ఉండాల్సిన మందులు…వసతులు… పరికరాలు కూడా లేవు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన జగన్ రెడ్డి అన్ని జిల్లా కేంద్రాల్లో మెరుగైన వైద్యసేవలు అందించేలా ఆసుపత్రుల్ని తీర్చిదిద్దాడా? పేరుకే జిల్లా ఆసుపత్రులు తప్ప..వాటిలో కనీస వసతులు కూడా లేవు. తగినంత మంది వైద్యులు.. వైద్య సిబ్బంది లేరు. కార్డియాలజీ…. న్యూరాలజీ… యూరాలజీ..ఆప్తాలజీ…న్యూరోసర్జన్.. పీడియాట్రీషన్ వంటి విభాగాల వైద్యులు, సిటీ స్కాన్.. ఎమ్ఆర్ఐ.. రేడియాలజీ వంటి పరీక్షలు అందుబాటులో లేవు.

రూ.1000 నుంచి రూ.25లక్షల వరకు పేదలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్నామనే ముఖ్యమంత్రి మాటలు పచ్చిఅబద్ధాలు. ముఖ్య మంత్రికి నిజంగా దమ్ము ఉంటే, తాను చెప్పే అంశాలపై ఏ ఆసుపత్రిలో పేదలకు రూ.25లక్షల విలువైన వైద్యసేవలు అందాయో నిరూపించాలి. వైద్యఆరోగ్య శాఖ మంత్రిగానీ, వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగానీ ఈ అంశంపై బహిరంగ చర్చకు రావచ్చు. సమాచారహక్కు చట్టం ద్వారా తాము సేకరించిన వివరాలతో చర్చకు మేం సిద్ధం.

పేదలకు అందాల్సిన ఆరోగ్యశ్రీ నిధుల్ని వైసీపీ పందికొక్కులు తినేశాయి
ఆరోగ్యశ్రీ కింద పేదలకు అందాల్సిన డబ్బుని కూడా జగన్ రెడ్డి.. వైసీపీ వాళ్లు పందికొక్కుల్లా తినేశారు. నకిలీ రోగుల్ని సృష్టించి ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రు లతో కుమ్మక్కై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా కోట్ల రూపాయల సొమ్ము స్వాహా చేశారు. ఈ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై వైద్యశాఖ మంత్రి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సమాధానం చెప్పాలి. గుంటూరు, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో జరిగిన దోపిడీ గురించి పత్రికల్లో కథనాలు వచ్చినా మంత్రి ఎందుకు స్పందించలేదు?

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన జగన్ రెడ్డి సిగ్గులేకుండా జగనన్న సురక్ష.. విలేజ్ హెల్త్ క్లినిక్ అని గొప్పులు చెప్పుకుంటున్నాడు. మందులు… వైద్యులు లేకుండా హెల్త్ క్లినిక్ లు ఎందుకు? జగనన్న ఆరోగ్యసురక్ష పథకం కింద పేదలకు రూ.500ల రవాణా ఖర్చులు చెల్లిస్తున్నట్టు జీవోలిచ్చి మరీ ప్రచారం చేసుకున్నారు. ఎక్కడా పేదలకు రూపాయి ఇచ్చింది లేదు.

ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద టీడీపీప్రభుత్వం రూ.7,525కోట్లు ఖర్చుపెట్టి 1.30కోట్లమందికి నాణ్యమైన వైద్యసేవలు అందించింది. జగన్ రెడ్డేమో ఆరోగ్య శ్రీ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నాడు
2014 నుంచి 2019 వరకు ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద టీడీపీ ప్రభుత్వం రూ.7,525కోట్లు ఖర్చుపెట్టి, 1,31,08,369 మందికి నాణ్యమైన వైద్యసేవలు అందించడం జరిగింది. ఇదే విధంగా 2019 నుంచి 2023 వరకు తన ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ఎంతఖర్చు పెట్టి… ఎందరికి వైద్యసేవలు అందించిందో చెప్పా లి. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఉన్న జగన్ రెడ్డి, అదే పథకంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నట్టు చెప్పడం వారిని వంచించ డం కాదా? ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల వారు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసే వలు అందించడం లేదని బోర్డులు పెట్టి, పేదరోగుల్ని బయటకు పంపిన దాఖలాలు అనేకం.

టీడీపీ ప్రభుత్వం వైద్యసేవలకోసం 279 తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ లు.. 292 చంద్రన్న సంచార చికిత్స వాహనాలు.. 468 వరకు 108 అడ్వాన్స్ డ్ లైఫ్ సపోర్ట్ వాహనాలు…122ఫీడర్ అంబులెన్స్ లు… 450 బాలసురక్ష వాహ నాలు.. 343 బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలతో పాటు 53 మహాప్రస్థానం వాహానాలు కొని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించింది. టీడీపీప్రభుత్వంలో వైద్య సేవలు అందించిన వాహనాలు నేడు ఎందుకు కనిపించడం లేదో, తాను ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన 108 వాహానాలు ఏమయ్యాయో ముఖ్యమంత్రి చెప్పా లి.

108 నంబర్ డయల్ చేయగానే.. కుయ్ కుయ్ అంటూ అంబులెన్సులు వస్తా యని చెప్పిన జగన్ రెడ్డికి.. ద్విచక్రవాహానాలపై రోగుల్ని.. మృతదేహాల్ని తరలిం చిన ఘటనలు కనిపించలేదా? 108, 104 వాహానాల కోసం రూ.341కోట్లకు పైగ ఖర్చు పెట్టినట్టు చెప్పిన జగన్ రెడ్డి.. ఆ వాహానాల పరిస్థితి ఏమిటో చెప్పాలి.

సీఎం.ఆర్.ఎఫ్ కింద టీడీపీ ప్రభుత్వం రూ.10,500కోట్లు అందిస్తే, జగన్ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులకు మందులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బాకీలు పెట్టింది
ఎన్టీఆర్ వైద్యసేవ కింద టీడీపీ ప్రభుత్వం కోటి20లక్షల మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయించింది. 14లక్షల మంది మహిళలకు మాస్టర్ చెకప్ పేరుతో వివిధరకాల వైద్యపరీక్షలు ఉచితంగా అందించింది. సీ.ఎం.ఆర్.ఎఫ్ కింద 10,500కోట్ల నగదు సాయం చేయడం జరిగింది. ఇలాంటివేవీ జగన్ ప్రభుత్వంలో లేవు.

ఆఖరికి ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు..రోగులకు భోజనం అందించేవారికి కూడా బిల్లులు ఇవ్వని దుస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రేమో వైద్య రంగంలతో సంచలనాలు సాధించామంటూ ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు. ప్రచారం పీక్స్ లో ఉంటే… పనితనం వీక్ గా ఉందనేది వాస్తవం.

టీడీపీ ప్రభుత్వంలో మెరుగైన వైద్యసేవలు అందించి దేశంలోనే 29వ స్థానంలో నిలిచిన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి, జగన్ హాయాంలో 151వ స్థానానికి దిగజారింది
ప్రపంచ ఆరోగ్యచరిత్రలోనే సంచలనంగా పేరొందిన ప్రాణదానం ట్రస్ట్ ను చంద్రబాబు ప్రారంభించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె స్ లో పేదలకు ఉచితంగా ఈ ప్రాణదానం పథకాన్ని అందించిన ఘనత టీడీపీప్రభుత్వానిదే. తిరుపతి స్విమ్స్ సూపర్ స్పెషాలటీ ఆసుపత్రి ఉత్తమ వైద్యసేవలు అందించడం ద్వారా టీడీపీ హాయాంలో దేశంలో 29వ స్థానంలో నిలి స్తే, అలాంటి ఆసుపత్రి జగన్ హాయాంలో 151 స్థానానికి చేరింది.

తిరుపతి స్విమ్స్ తో పాటు.. బర్డ్స్ ఆసుపత్రి కూడా టీడీపీ పాలనలో ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందింది. ఈ విధంగా జగన్ రెడ్డి హాయాంలో చెప్పుకోవడానికి ఒక్క ఆసుపత్రి అయినా ఉందా? 4 ఏళ్ల 10నెలల జగన్ పాలనలో పేదల వైద్యానికి చెల్లించాల్సిన వేలకోట్లను వైసీపీ పందికొక్కులు దోచేశాయి. పేదలకు ఎక్కడా నాణ్యమైన వైద్యం అందడం లేదు.” అని ప్రసాద్ తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE