Suryaa.co.in

Telangana

మేమున్నాం..ధైర్యంగా ఉండండి….

-జోరు వాన‌ను సైతం లెక్క చేయ‌కుండా వాగులు, వంక‌లు దాటుతూ….
-ముంపు బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
-వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలి
-అధైర్య‌ప‌డ‌కండి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది
-బాధితుల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి భ‌రోసా

నిర్మ‌ల్, జూలై 11: నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వ‌రుస‌గా మూడో రోజు విస్తృతంగా ప‌ర్యటించారు. జోరు వాన‌ను సైతం లెక్క చేకుండా వాగులు, వంక‌లు దాటుతూ… వ‌ర‌ద నీరు, బుర‌ద‌లోనే సోమ‌వారంmin-indrakiran ప‌రిమండ‌ల్ లో వర్షానికి కుంగిన బ్రిడ్జ్ , కిష‌న్ రావు పేట్ ముంపు గ్రామాల్లో ప‌ర్య‌టించారు. కిష‌న్ రావు పేట్ లో గండిప‌డిన చెరువును ప‌రిశీలించారు. ముంపునకు గురైన ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే వారికి భరోసా కల్పించారు. వ‌ర్షాల వ‌ల్ల దెబ్బ‌తిన్న‌ పంట పోలాల‌ను ప‌రిశీలించి…. రైతుల పరిస్థితిని నేరుగా తెలుసుకున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌భుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

నిర్మ‌ల్ జిల్లాలో స‌గ‌టున 22 సెంటిమీట‌ర్ల భారీ వ‌ర్షం కుర‌వ‌డం వ‌ల్ల ఈ ప్రాంత‌మంతా అత‌లాకుత‌ల‌మైంద‌న్నారు. చెరువులు, కాలువ‌ల‌కు గండ్లు ప‌డ్డాయని, రోడ్లు దెబ్బ‌తిన్నాయని, విద్యుత్ అంత‌రాయం క‌లిగింద‌ని, పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని వివ‌రించారు. జిల్లాలోని ప్రాజెక్ట్ లు అన్నినిండుకుండ‌లా మ‌రామ‌న్నారు.

అదేవిధంగా అసాధారణ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి జిల్లా అధికారా యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వీలైనంత సహాయం అందిచాలన్నారు. భారీ వర్షాలు వరదల వల్ల జిల్లా వ్యాప్తంగా అపార నష్టం జరిగిందన్నారు. చెరువు కట్టలు తెగిపోవటం, గండ్లు పడటం, రోడ్లు తెగిపోవటం లాంటి సంఘటనలు జరిగాయ‌ని చెప్పారు. చాలా చోట్ల పంట నష్టం కూడా జరిగిందని ఆ వివరాలు కూడా సేకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రహదారులు, ఇతర మౌళిక వసతులు, పంటనష్టంపై అంచనా వేసి నివేదిక తయారు చేయాలన్నారు. మంత్రి వెంట జిల్లా క‌లెక్ట‌ర్ ముశ్ర‌ఫ్ అలీ ఫారూఖీ, ఇత‌ర అధికారులు, ప్ర‌జాప్ర‌తినిదులు ఉన్నారు.

LEAVE A RESPONSE