Suryaa.co.in

Andhra Pradesh

వెంకయ్య నాయుడుకు ఘనంగా వీడ్కోలు పలికిన మంత్రి జోగి రమేష్

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయిన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఘన వీడ్కోలు పలికారు. శనివారం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు మంత్రి వీడ్కోలు పలికారు. ఉదయం 8:00 గంటలకు ఆయన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు.

వీడ్కోలు పలికిన వారిలో ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. బాగ్చి, కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, కృష్ణాజిల్లా ఎస్పీ పి జాషువా, ప్రోటోకాల్ డైరెక్టర్ ఎం.బాలసుబ్రమణ్యం రెడ్డి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక ఉన్నారు.

LEAVE A RESPONSE