Suryaa.co.in

Andhra Pradesh

ఉప్పలమ్మ తల్లి సంబరాలకు రావాలంటూ మంత్రి కొడాలి నానికి ఆహ్వానం

గుడివాడ, సెప్టెంబర్ 15: కోరిన కోరికలు తీర్చే ఉప్పలమ్మ తల్లి సంబరాలకు రావాలంటూ రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను ఆహ్వానించారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని వైసీపీ నేత వడ్లాని సుధాకర్ – స్వాతి దంపతులు కలిశారు. ఈ సందర్భంగా వడ్డాని సుధాకర్ మాట్లాడుతూ ఈ నెల 18, 19 తేదీల్లో గుడివాడ పట్టణంలోని రాజేంద్రనగర్ 7 వ లైన్లో ఉన్న నివాసంలో గత మూడేళ్ళుగా ఉప్పలమ్మ తల్లి పూజలను నిర్వహించడం జరుగుతోందన్నారు. శక్తి స్వరూపిణి, ఆదిశక్తిగా అవతరించిన ఉప్పలమ్మ తల్లి చల్లని చూపులు సిరి సంపదలకు నిలయం అవుతుందన్నారు. భక్తులను కాచి కాపాడే ఉప్పలమ్మ తల్లి ఆయురారోగ్యాలను అందిస్తుందని చెప్పారు. ఈ పూజా కార్యక్రమాలకు రావాలని వడ్లాని దంపతులు మంత్రి కొడాలి నానిని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైసీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, మాజీ కౌన్సిలర్ మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE