Suryaa.co.in

Andhra Pradesh

డల్లాస్ లో గాంధీ విగ్రహాన్ని సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

డల్లాస్ లో స్పీకర్ అయ్యన్నతో కలిసి పర్యటించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

డల్లాస్/అమరావతి:: గత వారం రోజులుగా అమెరికాలో తన పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్న రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా డల్లాస్ లోనే గాంధీ విగ్రహాన్ని సందర్శించారు.

రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుతో కలిసి స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఈ పర్యటన సాగింది. అహింస, శాంతి ఆయుధంగా స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానేత జాతిపిత మహాత్మా గాంధీ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను గుర్తు చేసుకొని, భవిష్యత్ తరాలు మహాత్మా గాంధీ బాటలో పయనించాలని మంత్రి పిలుపునిచ్చారు.

రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచ దేశాల్లో సుప్రసిద్ధులని శాంతి సమానత్వం కోసం ఆయన అహింసా మార్గంలో జరిపిన పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ కోమటి జయరాం, ఎన్నారై ఇన్వెస్టర్స్ కోఆర్డినేటర్ రామకృష్ణ గుళ్లపల్లి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE