-రూ.76.66 కోట్ల సబ్సిడీ వెచ్చించనున్న ప్రభుత్వం
-సేంద్రియ సాగు, నేల ఆరోగ్యం కాపాడేందుకు గాను ప్రతి ఏటా మాదిరిగానే వానాకాలంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా
-నియోజకవర్గంలో చెక్ డ్యాంల కోసం మలి సంతకం
-ఇప్పటికే నియోజకవర్గంలో నిర్మాణం పూర్తై అందుబాటులోకి 10 చెక్ డ్యాంలు, నిర్మాణంలో 2 చెక్ డ్యాంలు
-మరో 18 చెక్ డ్యాంలు, ఒక చెక్ డ్యాం మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన
-చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలు, కాలువల ద్వారా ఇప్పటికే లక్ష పై చిలుకు ఎకరాలకు సాగునీరు
-ఖిల్లా ఘణపురం మండలంలో 5, వనపర్తి మండలంలో 3 కొత్తవి, ఒకటి మరమ్మతు, పెద్దమందడి -మండలంలో 8, రేవల్లి మండలంలో 2 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.38.75 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్దం
-ఏటా రెండు, మూడు పంటలతో సాగులో నిమగ్నమైన రైతాంగం
-రైతులు, రైతు కూలీలకు నిరంతరం చేతినిండా పని
-ఉపాధి కోసం వలస వస్తున్న ఇతర ప్రాంతాల కూలీలు
గత తొమ్మిదేళ్లలో వనపర్తి ప్రాంతానికి సాగునీటి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఘణపురం, బుద్దారం కుడి, ఎడమ బ్రాంచ్ కెనాళ్లు, డీ8పై ఎంజె 3, ఎంజె 4 కాలువలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏడాది 11 నెలల స్వల్పకాలంలో 6.55 టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్ నిర్మాణం, కాలువలు సప్తసముద్రాలతో అనుసంధానం, గణపసముద్రం రిజర్వాయర్ గా మార్పు. 76.19 కోట్లతో కర్నె తండా ఎత్తిపోతల .. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్యే, సీఎస్ఆర్ నిధులతో 65 మినీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 40 టీఎంసీలు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సాధించిన మంత్రి. దీంతో 2.50 లక్షల ఆయకట్టు నుండి 5 లక్షల ఎకరాలలో పంటల సాగు సాధ్యమయింది. సాగునీటి రాకతో అత్యధికంగా భూగర్భజలాల పెరిగిన జిల్లాగా నిలిచిన వనపర్తి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా ఫైలుపై తొలిసంతకం, నియోజకవర్గంలో నూతన చెక్ డ్యాంల నిర్మాణ ప్రతిపాదనల ఫైలుపై మలి సంతకం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఆ సందర్భంగా ఛాంబర్ లో మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ , సహకార యూనియన్ చైర్మన్ రాజావరప్రసాద్ రావు,జడ్పీ చైర్మన్లు తదితరులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.