– తాను ప్రజల సేవకుడిని అనడమే కాదు..చేతల్లో చూపిన మంత్రి
– రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు వెంటనే వైద్య సేవలందేలాచేసిన మంత్రి
నూజివీడు/ఏలూరు : చాట్రాయి మండలంలో పర్యటన నిమిత్తం శుక్రవారం నూజివీడు లో మంత్రి కార్యాలయంనకు వస్తున్న రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం తుక్కులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చూసి వెంటనే స్పందించారు. తాను స్వయంగా తన వాహనం దిగి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెర్సీపూడి కి చెందిన కె. సాల్వే అనే మహిళను హుటాహుటిన ప్రత్యేక వాహనంలో నూజివీడు ఏరియా ఆసుపత్రి పంపించారు.
అనంతరం నూజివీడు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేంద్ర సింగ్ కు ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను ఏరియా ఆసుపత్రికి పంపిస్తున్నామని, సదరు మహిళ ప్రాణాపాయం నుండి కాపాడి మెరుగైన వైద్య సేవలందించాలని, మహిళ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకి తెలియజేయాలని మంత్రి డా. నరేంద్ర సింగ్ కు చెప్పారు.
గాయపడిన మహిళను ఆసుపత్రికి పంపించే సమయంలో మంత్రి పడిన తపన, వైద్యాధికారి కి ఫోన్ చేసి ఆదేశించిన తీరును అక్కడి ప్రజలు గమనించి మానవత్వంతో పాటు ప్రజా సేవకుడి అనే మాటకు అర్దాన్నిచూపిన మంత్రి పార్థసారథి అని కొనియాడారు. తాను ప్రజా సేవకుడిని అని చెప్పడమే కాదు చేతల్లో చేసి చూపిన మంత్రి కొలుసు పార్థసారథి.