అమరావతి :రాష్ట్ర పర్యాటక,యువజన సంక్షేమం, సాంస్కృతిక, క్రీడల శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి)తో కేంద్ర క్రీడల శాఖ సంయుక్త కార్యదర్శి అతుల్ సింగ్ భేటీ అయ్యారు.రాష్ట్ర పర్యటనకు వచ్చిన అతుల్ సింగ్ వెలగపూడి సచివాలయంలో మంత్రి అవంతి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి చేయూతనందించి, నూతన స్టేడియంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు కేంద్ర క్రీడల శాఖ సంయుక్త కార్యదర్శిని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోక్రీడల అభివృద్దికి చేపట్టిన కార్యక్రమాలగురించి మంత్రి ఈసందర్భంగా వివరించారు.రాష్ట్ర క్రీడలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ,క్రీడలశాఖ ఉన్నతాధికారులు కూడా హాజర
య్యారు.