– జీఎస్టీ తగ్గింపుపై పామర్రు నియోజకవర్గ వీరంకి లాకుల లలో విస్తృత ప్రచారం
పామర్రు : ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో, వ్యాపారుల్లో అవగాహన కల్పించేందుకు జిఎస్టి , వివిధ శాఖల అధికారులు ఆధ్వర్యంలో మంగళవారం వీరంకి లాకుల లలో లో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ అవగాహన ప్రచార ర్యాలీ స్థానిక మీసేవ నుంచి ప్రారంభమై శుభం కళ్యాణ మండపం వరకు సాగింది. జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి ప్రజలకు చేకూరే ప్రయోజనాలు పై వ్యాపారులకు ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. దీని కోసం ఇంటింటా ప్రచార అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టామన్నారు. జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలు, వ్యాపారులు వద్దకు వెళ్లి సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కరపత్రాలు అందచేసి, జీఎస్టీ నూతన సంస్కరణల ద్వారా చేకూరే ప్రయోజనాలను వివరిస్తున్నామన్నారు. జిఎస్టి స్లాబులు తగ్గింపుతో నిత్యవసరాల వస్తువుల ధరలతో పాటు, సామాన్య ప్రజలకు సైతం ప్రయోజనం చేకూరేలా జీఎస్టీ రేట్లు తగ్గించారన్నారు.
జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలో నూతన అధ్యయమని మంత్రి పేర్కొన్నారు. ఈనెల 19 వరకు జీఎస్టీ పై ప్రజలకు అవగాహన కలిగేలా అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ పై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో కూటమి పార్టీ నాయకులు పాల్గొవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ లింగంనేని రామలింగేశ్వరరావు పామర్రు ఏఎంసీ చైర్మన్, ఉయ్యూర్ ఆర్ డి ఓ షారోనా, ఎమ్మార్వో గారు, సర్పంచ్ ముళ్ళపూడి సునీత అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.