Suryaa.co.in

Andhra Pradesh

రూ.20 వేలు ఆర్థిక సహాయం చేసిన మంత్రి సుభాష్

కె.గంగవరం: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఇద్దరు వ్యక్తులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించి మరోసారి తన మానవత్వాన్ని సాటి చెప్పారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా కె. గంగవరం మండలం పేకేరు, శివల తదితర గ్రామాల్లో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుల కోరిక మేరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేకేరు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు ఏడుకొండలకు రూ.15 వేలు, శివల గ్రామంకు చెందిన మానసిక దివ్యంగుడు పితాని బ్రహ్మం కు రూ.5 వేలు వెరసి మొత్తం రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందించారు.

ఒక్క మాటతో ఇరువురికి ఆర్థిక సహాయం అందించిన మంత్రి సుభాష్ కి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ పండుగ నేపథ్యంలో ఆర్థిక సాయం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి సుభాష్ సేవా దృక్పథాన్ని ప్రశంసించారు.

LEAVE A RESPONSE