– నాలుగు దశాబ్ధాలుగా తెలుగుదేశం జెండాను భుజస్కంధాలపై మోస్తున్న కార్యకర్తలే నిజమైన దేవుళ్లు
– ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ: నలభై మూడేళ్లు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ ఎగరేసిన జెండా ఇప్పటికీ సగర్వంగా ఎగురుతూనే ఉందన్నారు ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య . టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా నందిగామ టౌన్ పలు (13,10,7) వార్డులలో మరియు రైతు పేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు.
అనంతరం పార్టీ శ్రేణులతో కలసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అలానే మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా కూటమి నేతలతో కలసి తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అంటే పేదలకు ఓ భరోసా. కడుపు నిండా తిండికి…కట్టుకోవడానికి గుడ్డకి.. ఉండటానికి ఇంటికి చింత పడాల్సిన అవసరం లేనంత ధైర్యం పేదలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు.