Suryaa.co.in

Telangana

ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి వేముల

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహానికి శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సాయన్న మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. సాయన్న నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు అని,హైదరాబాద్ లో బ్యాంకు ఉద్యోగిగా సేవలందించి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5పర్యాయాలు ఇక్కడి ప్రజలకు సేవలందించారు అని గుర్తు చేశారు. ఆయన రాజకీయాల్లో వివాదరహితుడిగా, నిరాడంబరుడు గా నిలిచిన వ్యక్తి అన్నారు.

5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఎన్నడూ అధికార దర్పం ప్రదర్శించలేదని కొనియాడారు. తాను ఎప్పుడు కలిసిన మనం నిజామాబాద్ వాళ్లం అని గుర్తు చేసే వారని అన్నారు. సాయన్న నిజమైన అంబేద్కరిస్ట్ అని ఆయన ఆశయ స్ఫూర్తి కొనసాగిస్తామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు యావత్ నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన ప్రగాఢ సానుభూతి,సంతాపం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE