– రెండురాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తెలుగువారికి, తమిళులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి
• చంద్రబాబు విజన్ ను అభినందించిన రజనీకాంత్ ని, జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఆయన ప్రభుత్వంలోని వారు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
• రజనీకాంత్ ఎక్కడా జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని పల్లెత్తుమాట అనకపోయినా, వైసీపీవారు ఫ్రస్టేషన్ తో ఆయనపై దాడిచేయడం సరైందికాదు
• వైసీపీనేతలు, మంత్రుల మాటలతో రెండురాష్ట్రాల మధ్య వైషమ్యాలు రేకెత్తే ప్రమాదముంది
• రెండురాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యమంత్ర్రి తక్షణమే అటు తమిళప్రజలకు, ఇటుతెలుగువారికి బహిరంగక్షమాపణలు చెప్పాలి
• తన పరిపాలనరథం తిరోగమనంలో పయనిస్తోందన్న అక్కసుతోనే, ముఖ్యమంత్రి తన పార్టీ వారితో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ను అనరాని మాటలు అనిపించి ఆయన్ని కించపరిచారు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం అర్థంపర్థం లేకుండా, వింతపోకడలకు పోతోందని, తాగు బోతులు, గంజాయి సేవించిన వారిలా ప్రభుత్వంలోని వారు మాట్లాడటం బాధాకరమని, సభ్య సమాజం ఏమనుకుంటుందో అనేఆలోచన లేకుండా అధికారంలో ఉన్నవారు మాట్లాడటం సరైనవిధానం కాదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే ..
రజనీకాంత్ విజ్ఞత కలిగిన వారు కాబట్టే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదు
“ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మొన్న 28వతేదీన జరిగిన కార్యక్రమానికి నిర్వాహకులు ముఖ్యఅతిథిగా తమిళసూపర్ స్టార్, ప్రముఖనటులు రజనీకాంత్ ను ఆహ్వా నించారు. ఆయన కార్యక్రమంలో స్వర్గీయ ఎన్టీఆర్ గురించి, చంద్రబాబుగారి గురించి మాట్లా డినదానిపై ఉచ్ఛనీచాలు లేని వారితో మాట్లాడిస్తారా ముఖ్యమంత్రిగారు? మాజీ మంత్రి కొడా లినాని, మంత్రి రోజాలతో నోటికొచ్చినట్టు మాట్లాడిస్తారా? ప్రభుత్వవ్యవహారశైలి, మీ నాయ కుడి అవినీతిగురించి, ఆయనజైలుకెళ్లిన దానిగురించి, బాబాయ్ హత్యగురించి ఏమైనా రజనీకాంత్ మాట్లాడారా సజ్జలా? రజనీకాంత్ గారి మాటలపై ప్రభుత్వానికి ఎందుకంత ఉక్రో షం పొడుచుకొచ్చింది? రజనీకాంత్ గారు విజ్ఞతకలిగిన వారు కాబట్టే, ఎక్కడా వైసీపీ గురిం చి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయనపాలనగురించి మాట్లాడలేదు.
ఎదుటివారిని గౌరవించాలన్న సంస్కారం, ఆలోచన ముఖ్యమంత్రికి, ఆయనపార్టీలోని వారికి లేదు
చంద్రబాబు నాయకత్వం, ఆయన దార్శనికత, ముందుచూపుని ప్రస్తావిస్తూ, ఆయన హైదరాబాద్ లో నిర్మించిన హైటెక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయం, ఇతరత్రా అభివృద్ధి కార్య క్రమాల గురించి రజనీకాంత్ మాట్లాడితే వైసీపీవారికి, మంత్రులకు ఎందుకు అంతనొప్పి? చంద్రబాబు చేసిన అభివృద్ధి మీకు కనిపించడంలేదా రోజా? బూతులుమాట్లాడే వ్యక్తి అంటే సజ్జల రాసిచ్చింది చదువుతాడు. మీకు ఎక్కడ ఆలోచన లేదు రోజాగారు? ఎదు టివారిని గౌరవించాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి కానీ, ఆయనపార్టీవారికి గానీ ఎందు కు లేదు? రజనీకాంత్ ను నిందించాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? రజనీకాంత్ వ్యాఖ్య లపై సజ్జలరామకృష్ణారెడ్డి, మంత్రిరోజా చర్చకువస్తారా? తమిళంలో నటించిన రోజాకు, రజనీ కాంత్ ఎంతగొప్పనటుడో తెలియదా? తమిళప్రజలు మెచ్చిన నటుడిని ఉద్దేశించి, ఇష్టానుసారం మాట్లాడతారా? రోజాగారు, రజనీకాంత్ ను అన్నమాటలు తమిళప్రజలకుతెలిస్తే ఆమె పరిస్థితి ఏమిటి? రోజా టీడీపీలో తెలుగుమహిళ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు, రాజ మహేంద్రవరంలో అప్పటిముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సభనిర్వహిస్తుంటే, ఆయన్ని ఉద్దేశించి, “నువ్వు మగాడివైతే, నీకు మూతిమీద మీసముంటే” అంటూ ఏదేదో మాట్లాడింది . ఆ సందర్భంలో రోజామాట్లాడినదానిపై టీడీపీఅధినేత చంద్రబాబు ఆమెను ఏమిటా మాట లు అని వారించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా, అప్పటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రాజశేఖర్ రెడ్డిని గౌరవించారు… తనపార్టీలోఉన్నరోజాను వారించారు. అదీ చంద్రబాబు విజ్ఞత.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ కు బహిరంగక్షమాపణలు చెప్పాలి
ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమ వేదికను రాజకీయవేదికగా ఉపయోగించు కొని, తనపార్టీ వారితో ఇష్టాను సారం మాట్లాడించినందుకు తెలుగువారికి కూడా క్షమాపణచెప్పాలి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో నటుడురజనీకాంత్ మాట్లాడినవన్నీ అక్షరస త్యాలే. తనపార్టీవారితో, ప్రభుత్వంలోని వారితో రజనీకాంత్ గారిని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడించినందుకు నైతికబాధ్యతవహిస్తూ ముఖ్యమంత్రి తక్షణమే తమిళసూపర్ స్టార్ కు బహిరంగక్షమాపణలు చెప్పాలి. ఎన్టీఆర్ వంటి మహానుభావుడి శతజయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని రాజకీయకోణంలో చూసినందుకు తెలుగువారికి కూడా ముఖ్యమంత్రిగారు వెం టనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తెలుగు, తమిళ ప్రజల ఆగ్రహాని కి జగన్మోహన్ రెడ్డి గురవుతారు. రోజా, కొడాలినాని ఇచ్చే సర్టిఫికెట్స్ కోసం ఎన్టీఆర్ శతజ యంతి సభ నిర్వహించారా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకొద్దు అంటూ రాష్ట్రప్రజలు ఆయ నపై, ఆయనప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. తనపరిపాలనా రథం రివర్స్ లో నడు స్తోంది అని ముఖ్యమంత్రికి అర్థమైంది. అందుకే తన, పర బేధాల్లేకుండా అందరినీ తనపార్టీ వారితో తిట్టిస్తున్నారు. నిన్నశ్రీకాకుళంలో మంత్రిధర్మాన మీ పార్టీకి ప్రజలఓట్లు పడవని చెప్పకనే చెప్పారుగా ముఖ్యమంత్రిగారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను మీ పార్టీ, ప్రభుత్వంలోని వారు కించపరచడం వల్ల రెండురాష్ట్రాల మధ్య వైషమ్యాలు రేకెత్తే ప్రమాద ముందని ముఖ్యమంత్రి గ్రహించాలి.
చంద్రబాబుకి, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా సారూప్యత లేదు… ఉండబోదు
టోనీ బ్లెయర్ ను బ్రిటన్ ప్రధానిహోదాలో రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి వారు చంద్రబాబుగారి విజన్ ను కొనియాడారు. దేశప్రధానిగా వాజ్ పేయ్ చంద్రబాబుగారి లాంటి నాయకుడు దేశానికి అవసరమన్నారు. అదీ చంద్రబాబు ఘనత. అలా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైనా మెచ్చుకున్నారా? ఏమని మెచ్చుకుం టారు? ఏంచేశారని మెచ్చుకుంటారు? జగన్ కు, చంద్రబాబుకి ఎక్కడా సారూప్యతే లేదు. ఇక ముందు ఉండబోదు.
దళితులకు జగన్మోహన్ రెడ్డి ఏం ఒరగబెట్టాడని, దళితసంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉంది?
సొంతపత్రిక, టీవీ చేతిలో ఉన్నాయని మీగొప్పలు మీరుచెప్పుకోవడం కాదు ముఖ్యమంత్రి. మీరుచేసిన మంచిని ప్రజలుచెప్పాలి. మీరు, మీప్రభుత్వం దళితులకు ఏంచేసిందని దళితసంక్షేమంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంది? ఎస్సీకార్పొరేషన్ లేదు.. విదేశీ విద్య పథకం లేదు.. చంద్రబాబు గారుదళితులకు పెట్టిన 28పథకాల్ని తొలగించారు. ఏంచేశారని దళితసంక్షేమంలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ఇలా అబద్ధాలు, అసత్యాలు ఎన్నాళ్లు వండివా రుస్తారు ముఖ్యమంత్రిగారు? మీరు ఫ్రస్టేషన్లో ఉన్నారు. కాబట్టే డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరు తీసేసి, విదేశీవిద్య పథకానికి మీపేరు పెట్టుకున్నారా ముఖ్యమంత్రి గారు? మీరు ఏంచేస్తు న్నా ప్రభుత్వంలోని దళితమంత్రులు నోరెత్తరు. సీతకొండ పేరుని వైఎస్సార్ వ్యూపాయింట్ గా మార్చడం ఏమిటి? మీ తండ్రి తన అధికా రాన్ని ఉపయోగించి, మిమ్మల్ని భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నేతను చేశారు. ఎలాచేశారు.. అవినీతి, అధికారదుర్వినియోగం ఉపయోగించికాదా? మీపై ఉన్న అవి నీతికేసుల్లో సీబీఐ వేసిన ఛార్జ్ షీట్లలో మీతండ్రిగారి పేరు చేర్చలేదా? జగన్మోహన్ రెడ్డి తక్షణమే సీతకొండపేరుని యథావిథిగా కొనసాగించాలి. అలానే టీడీపీప్రభుత్వం తీసుకొచ్చిన విదేశీవిద్య పథకానికి అంబేద్కర్ పేరే పెట్టాలి.” అని రామయ్య డిమాండ్ చేశారు.