శనివారం ఉదయం 6:00″గం నుండి” రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు నగరాలు నీట ములగడం జరిగినది ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అధికారులతో వెళ్లి నీట మునిగిన ఇళ్లను పరిశీలించి వెంటనే మురుగు నీరు మోటార్లు చెప్పించి బయటకు లాగవాల్సిందిగా అదేశించి, స్థానికులకు భోజనం, టిఫిన్ ఏర్పాట్లు చూడవలసినదిగా సంబంధిత అధికారులను స్థానిక నాయకులను ఆదేశించారు.
ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. నియోజకవర్గం లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు ఉన్న తరుణంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని.. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. మ్యాన్ హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలని,ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలకు ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థకు ఆటంకం లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.