పెందుర్తి/గాజువాక: యువనేత నారా లోకేష్ చేపట్టి చారిత్రాత్మ యువగళం పాదయాత్ర 226వరోజు (సోమవారం) గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివాజీనగర్ వద్ద ముగియనుంది. ఈ సందర్భంగా లోకేష్ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా పార్టీశ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. యువగళం ముగింపు కార్యక్రమానికి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. యువగళం పాదయాత్ర 225వరోజు పెందుర్తి/గాజువాక నియోజకవర్గాల్లో కోలాహలంగా సాగింది. భరణికం గ్రామం వద్ద యువనేత లోకేష్ పాదయాత్ర పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మాజీమంత్రి బండారు సత్యనారారాయణ మూర్తి నేతృత్వంలో లోకేష్ కు పెందుర్తి ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా మహిళలు లోకేష్ కు హారతులు పడుతూ, దిష్టితీస్తూ నీరాజనాలు పట్టారు. వివిధ వర్గాల ప్రజలు లోకేష్ కు సంఘభావం తెలియజేసి సమస్యలు చెప్పుకున్నారు. యువనేతతో ఫోటోలు దిగేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. రోడ్లకు ఇరువైపులా బారులు తీరిన జనంలోకేష్ తో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. తోటాడ స్మార్ట్ సిటీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర సిరసపల్లి, వెంకటాపురం మీదుగా భరణికం వద్ద పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
అక్కడనుంచి పరవాడ, గొర్లవానిపాలెం, చింతలగొర్లవానిపాలెం, జాజులవానిపాలెం, దేశపట్నూరిపాలెం మీదుగా స్టీల్ ప్లాంట్ గేటు వద్ద గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గాజువాక ఇన్ చార్జి పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. స్టీల్ ప్లాంట్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. సేవ్ వైజాగ్ స్టీల్ బ్యానర్లతో యువనేతకు సంఘీభావం స్టీల్ ప్లాంట్ కార్మికులు యువనేతకు సంఘీభావం తెలిపారు. భారీ గజమాలలు, బాణాసంచా మోతలు, డప్పుల శబ్ధాలతో స్టీల్ ప్లాంట్ పరిసరాలు దద్దరిల్లాయి. యువనేతతో ఫోటోలు దిగేందుకు యువకులు, మహిళలు మహిళలు పోటీపడ్డారు. తర్వాత సెక్టార్ -10 బస్టాప్, సెక్టార్ – 5 కాంప్లెక్స్ మీదుగా సిడబ్లుసి-1 వద్ద విడిది కేంద్రం వద్దకు చేరుకుంది. 225వరోజు యువనేత లోకేష్ 17.6 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 3119 కి.మీ.లు పూర్తయింది.
యువనేత లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్
*ఈ సర్వేరాళ్లే…మీ అరాచక సర్కారుకు సమాధిరాళ్లు!!*
ఇవి యలమంచిలి నియోజకవర్గం తోటాడ వద్ద జగనన్న భూరక్ష పేరుతో సిద్ధంగా ఉన్న హద్దురాళ్లు. పరిపాలనకంటే స్కిక్కర్లు, బొమ్మలకే పెద్దపీట వేసే జగన్ రెడ్డి సర్వేరాళ్లను సైతం వదలకుండా వాటిపై తమ పేరు వేసుకున్నాడు. వాస్తవానికి ఆ పథకానికి జగనన్న భూభక్ష అని పేరు పెడితే కరెక్టుగా సరిపోయేది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసిలకు చెందిన పేదలు, ప్రభుత్వ భూములు, ఆలయాల భూములు గుర్తించి వాటిని కొట్టేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్. ముందు సర్వే అంటారు, తర్వాత రాళ్లు అంటారు, చివరిగా ఈ భూమి మాదే అంటారు. కావాలంటే రాళ్లపై మా జలగన్న బొమ్మ ఉంది చూసుకోండని చెబుతారు. ఇటువంటి సర్వే రాళ్లే మీ అరాచక ప్రభుత్వానికి సమాధిరాళ్లు కాబోతున్నాయి… రాసి పెట్టుకో జగన్మోసపురెడ్డీ?!
*కలర్ మార్చినంత మాత్రాన…*
*కట్టినవారి పేరు చెరగదు మై డియర్ సైకో జగన్!!*
పెందుర్తి నియోజకవర్గం పరవాడ శివారు గొర్లవానిపాలెంలో టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలివి. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లు కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాని జగన్… టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలకు మాత్రం సిగ్గులేకుండా రంగులేసుకున్నాడు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3.13లక్షల టిడ్కోగృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి, 90శాతానికి పైగా పూర్తిచేసింది. మిగిలిన 10శాతం పూర్తిచేసి పేదలకు ఇవ్వడం చేతగాని జగన్… ఆ ఇళ్లపై బ్యాంకుల నుంచి అప్పుతెచ్చి వాడేశాడు. కలర్ మార్చినంత మాత్రాన కట్టినవారి పేరు చెరగదు మై డియర్ సైకో జగన్!!
2).జిఓ 229అమలుతో పంచగ్రామాల సమస్యకు చెక్!
కోర్టు కేసులతో అడ్డుకుంది వైసిపి లీగల్ సెల్ వారే
పంచగ్రామాల బాధితులతో యువనేత నారా లోకేష్
పెందుర్తి: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిఓ 229ను అమలుచేసి పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గం పరవాడ సంతబయలులో పరవాడ సంతబయలు వద్ద పంచగ్రామల ప్రజలతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేసింది చంద్రబాబు నాయుడు. జిఓ 578 తీసుకొచ్చి రెగ్యులరైజ్ చెయ్యాలని ప్రయత్నించింది టిడిపి ప్రభుత్వం. అప్పట్లో వైఎస్ డబ్బులు కట్టొద్దు. నేను వచ్చి ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీ వేసి సమస్య ను మరింత జఠిలం చేసారు. 2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయపరంగా ఉన్న సమస్యలు అధిగమించి జిఓ 229 తీసుకొచ్చి దేవస్థానం కు వేరే భూమి కేటాయించి పంచగ్రామల సమస్య పరిష్కారం చెయ్యాలని ప్రయత్నించింది చంద్రబాబు. టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు పంచగ్రామాల సమస్య పరిష్కారం కోసం కృషి చేసారు.
వైసిపి వాళ్లే అడ్డుకున్నారు!
పంచగ్రామాల ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. ఈ సమస్య పై నాకు పూర్తి అవగాహన ఉంది. 12 వేల ఎకరాలు, 18 వేల ఇళ్లకు సంబందించిన సమస్య. లక్ష మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్యం, ఇతర అవసరాల కోసం ఆస్తులు అమ్ముకునే హక్కు లేకుండా పోయింది. కనీసం ఇంటి రిపేర్లు చేసుకునే పరిస్థితి లేదు. వైసిపి లీగల్ సెల్ లో పనిచేసే వారు కోర్టు కి వెళ్లి జిఓ 229 అమలు కాకుండా చేశారు. జగన్ పాదయాత్ర లో వచ్చి అధికారంలోకి వచ్చిన నెలలో సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చాడు. బిల్డప్ బాబాయ్ అదీప్ రాజ్ ఎమ్మెల్యే అయిన వెంటనే సమస్య పరిష్కారం చేస్తానని చెప్పాడు. నాలుగున్నర ఏళ్లుగా కమిటీ పేరుతో కాలక్షేపం చేశారు. ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేదు. సమస్య పరిష్కారం కోసం కృషి చేసింది టిడిపి. సమస్య పరిష్కారం కాకుండా అడ్డుకుంది వైసిపి.
ఒకే మాటమీదు ఉంటే సమస్య పరిష్కారం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జిఓ 229 అమలు చేస్తాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఇళ్ల సమస్య తో పాటు రైతుల సమస్యను కూడా పరిష్కరిస్తాం. టిడిపి హయాంలో ఇళ్లు రిపేర్లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. వైసిపి ప్రభుత్వం కనీసం రిపేర్లు చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్య పరిష్కారం చేస్తాంపంచగ్రామాల ప్రజలు అంతా ఒకే మాట కు కట్టుబడి ఉంటే సమస్య పరిష్కారం సులభం అవుతుంది. నాడు కాంగ్రెస్ నేడు వైయస్సార్ కాంగ్రెస్ పంచగ్రామాల సమస్యను పెద్దదిగా చేసారు.
పంచగ్రామాల ప్రజలు మాట్లాడుతూ…
పంచగ్రామాల సమస్య తో లక్ష మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం భూములు అమ్ముకునే హక్కు లేక ఇబ్బంది పడుతున్నాం. కనీసం ఇంటికి రిపేర్లు చేసుకునే హక్కు కూడా మాకు లేదు. పంచగ్రామాల సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు గారు ఇచ్చిన జీఓ 578 ని వైఎస్ గారు రద్దు చేశారు. చంద్రబాబు గారు 2014 ముఖ్యమంత్రి అయిన తరువాత జీఓ 229 ని జగన్ అడ్డుకున్నారు. 1800 ఎకరాలు రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమి పై హక్కులు లేక ఇబ్బంది పడుతున్నాం. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు చెందేలా చూడాలి. జిరాయితీ రైతులకు పూర్తి హక్కులు కల్పించాలి. ఇనామ్ విలేజ్ లు అంటూ మాకు తీవ్ర అన్యాయం చేసారు. సుమారుగా 21 ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని పోరాటాలు చేసినా మాకు న్యాయం జరగలేదు.
3).*నారా లోకేష్ ను కలిసిన తోటాడ ప్రజలు
యలమంచిలి నియోజకవర్గం తోటాడ, పరిసర గ్రామాల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.తోటాడ, పరిసర గ్రామాలకు అనకాపల్లి బైపాస్ దాటి వెళ్లాల్సివస్తోంది.హైవే దాటే క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటి వరకు వందలాదిమంది చనిపోయారు.రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అండర్ పాస్ నిర్మించాలి.టీడీపీ అధికారంలోకి వచ్చాక అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
జగన్మోహన్ రెడ్డికి అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదు. ప్రజలపై పన్నుమీద పన్నులు వేస్తున్న జగన్ మౌలిక సదుపాయాల కల్పనను గాలికొదిలేశారు.టిడిపి అధికారంలోకి వచ్చాక మెంటాడ, పరిసర గ్రామాల ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా అండర్ పాస్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.రాష్ట్రవ్యాప్తంగా పాడైన రోడ్లస్థానంలో కొత్తరోడ్లు నిర్మించి ప్రమాదాలను నివారిస్తాం.
4).*లోకేష్ ను కలిసిన సిరసపల్లి, వెంకటాపురం గ్రామస్తులు
యలమంచిలి నియోజకవర్గం సిరసపల్లి, వెంకటాపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.అనకాపల్లి వయా తోటాడ పరవాడ మీదుగా వెళ్లే రహదారిపై అనేక కంపెనీలకు భారీ వాహనాలు వెళుతుంటాయి.ఈ రోడ్డు నుండి 25గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.రోడ్డు విస్తరణ చేయకపోవడంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నారు.కలెక్టర్, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు.మీరు అధికారంలోకి వచ్చాక రోడ్డును విస్తరణ చేసి మా సమస్యలను పరిష్కరించాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.రాష్ట్రంలో గోతుల్లో రోడ్లు ఎక్కడుందో వెదుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్లకు కనీసం మరమ్మతు చేయలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉంది.జగన్ మొఖం చూసి రోడ్లు వేయడానికి టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు పరారవుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో కాంట్రాక్టర్లకు జగన్ రూ.2లక్షల కోట్లు బకాయిలు పెట్టారు.టిడిపి అధికారంలోకి వచ్చాక అనకాపల్లి వయా తోటాడ పరవాడ మీదుగా వెళ్లే రహదారిని విస్తరించి ప్రజల కష్టాలు తీరుస్తాం.
5).*లోకేష్ ను కలిసిన ఎల్ జి పాలిమర్స్ బాధితులు
పెందుర్తి నియోజకవర్గం వెంకటాపురం గ్రామ అభివృద్ధి సేవాసంఘం ఆధ్వర్యంలో ఎల్ జి పాలిమర్స్ బాధితులు యువనేత లోకేష్ ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.ఎల్ జి పాలిమర్స్ ప్రభావిత గ్రామంగా ఉన్న వెంకటాపురానికి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలి.మా గ్రామప్రజలు ఆనాటి విషవాయువు పీల్చడం వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారు.మాకు జీవితకాల హెల్త్ కార్డులు ఉచితంగా ఇప్పించి, వైద్యం అందించాలి.విషవాయువు వల్ల నీరు కలుషితమైనందున ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేయాలి.ఆనాడు అనారోగ్యానికి గురైన ఆసుపత్రి పాలైన 1100మంది బాధితుల్లో కొంతమందికి మాత్రమే పరిహారం అందింది, మిగిలినవారికి ఇప్పటివరకు కూడా పరిహారం అందించలేదు.అందరికీ పరిహారం అందేలా చూడాలి.పర్యావరణ, కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటుచేసి మా బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలి.ఎల్ జి పాలిమర్స్ బాధితులు జి.చంద్రశేఖర్, సిహెచ్ దివాకర్, పి.సూరిబాబు, పి.సురేష్, ఎన్.లత యువనేత లోకేష్ ను కలిసిన వారిలో ఉన్నారు.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పర్యావరణ, కాలుష్య నియంత్ర చట్టాల అమలును పర్యవేక్షించకపోవడం వల్లే ఎల్ జి పాలిమర్స్ ఘటన చోటుచేసుకుంది.రాష్ట్రచరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన విశాఖపట్నం ఎల్ జి పాలిమర్స్ లో మే 7, 2020న దుర్ఘటన జరిగింది. 15మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ లో 45 రోజులుగా మూతబడిన ఈ పరిశ్రమకు ఎటువంటి తనిఖీలు లేకుండా ఎస్సెన్షియల్ కమోడిటీస్ కింద అనుమతులు ఇచ్చి తెరిపించింది.దుర్ఘటన జరిగాక జగన్ చుట్టపు చూపుగా విశాఖ వచ్చి వెళ్లారే తప్ప ఇప్పటివరకు బాధితుల సమస్యను ఇప్పటివరకు పరిష్కరించకపోవడం దారుణం.విశాఖలో హుదుహుద్ తుపాను సంభవించినపుడు పరిస్థితులు చక్కబడే వరకు చంద్రబాబునాయుడు అక్కడే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షించారు.ఎల్ జి పాలిమర్స్ బాధిత గ్రామాలకు ఆనాడు ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.మరో 3నెలల్లో టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్ జి పాలిమర్స్ బాధిత గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.ప్రభావిత గ్రామాల ప్రజలందరికీ హెల్త్ కార్డులిచ్చి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటాం.పర్యావరణహిత, కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం.
6).
*ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన యువనేత లోకేష్*
పెందుర్తి: తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అన్న ఎన్టీఆర్ అని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గం పరవాడమార్కెట్ సెంటర్ లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… డిల్లీ పాదాల చెంత తెలుగువారి ఆత్మగౌరవం బందీగా మారిన సమయంలో ప్రపంచం మేం తెలుగువారమని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదవాడికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించాలన్న లక్ష్యంతో 2 రూపాయలకు కిలోబియ్యం, జనతా వస్త్రాల పంపిణీ, పక్కాగృహాల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేశారన్నారు. మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
7).*లోకేష్ ను కలిసిన పరవాడ గ్రామ మహిళలు
పెందుర్తి నియోజకవర్గం పరవాడ గ్రామ డ్వాక్రా మహిళలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మా గ్రామంలోని డ్వాక్రా మహిళలకు ఆసరా డబ్బులు గ్రూపులకు జమకాలేదు.టీడీపీ పాలనలో డ్వాక్రా మహిళలకు పెద్దఎత్తున లబ్ధి చేకూరింది.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళలకు చేసిందేమీ లేదు.2024లో అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళలకు గతంలో అమలు చేసిన పథకాలు అమలు చేయాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి మహిళలకు అనేక హామీలు ఇచ్చి మోసగించాడు.మహిళలు దాచుకున్న రూ.2500 కోట్ల అభయహస్తం డబ్బును దోచుకున్న గజదొంగ జగన్.మహిళలకు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో డ్వాక్రాసంఘాలను చంద్రబాబు బలోపేతం చేశారు.టిడిపి అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాలకు మళ్లీ గతవైభవం కల్పిస్తాం.అభయహస్తం పథకాన్ని పునరుద్దరిస్తాం, డ్వాక్రాగ్రూపులను బలోపేతం చేస్తాం.
8).*నారా లోకేష్ ను కాపు సామాజికవర్గ నాయకులు
పెందుర్తి నియోజకవర్గం పరవాడ ఐఓసి పెట్రోలు బంకు కాపు సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.టీడీపీ పాలనలో పరవాడ బోనంగి కాలనీలో కాపు సంక్షేమ భవనం నిర్మించడానికి రూ.50లక్షలు మంజూరు చేశారు.భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భవనం నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు.భవనం పూర్తయితే చుట్టుప్రక్కల గ్రామాలకు ఫంక్షన్లు చేసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.భవన నిర్మాణం ఆగిపోవడంతో పిచ్చిమొక్కలు మొలిచి పాడైపోయింది.2024లో అధికారంలోకి వచ్చాక కాపు సంక్షేమ భవనాన్ని పూర్తిచేయాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
జగన్మోహన్ రెడ్డి కాపుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు.కాపులకు బడ్జెట్ లో రూ.3వేల కోట్లు ఇస్తామని చెప్పి మోసం చేశాడు.కాపు రిజర్వేషన్ల విషయంలో మాటతప్పి మడమతిప్పాడు.టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా నిలచిపోయిన కాపు సంక్షేమ భవనాలను పూర్తిచేస్తాం.కాపు రిజర్వేషన్ల విషయంలో గతంలో అసెంబ్లీలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. కాపులకు గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం.
9).*నారా లోకేష్ ను కలిసిన నిరుద్యోగ యువకులు
పెందుర్తి నియోజకవర్గం గొర్లవానిపాలెం జిజె కాలేజి వద్ద బోనంగి, లెమర్తి, తాడి, తానం గ్రామాలనిరుద్యోగ యువకులు యువనేత లోకేష్ ను కలిసి సంఘీభావం తెలిపారు.యువతకు ఉద్యోగాలివ్వడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని తూర్పార బడుతూ ప్లకార్డులు చేతబూనారు.ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులు లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు.మా ప్రాంతంలో రాంకీ వారి నేతృత్వంలో జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఏర్పాటుచేశారు.ఫార్మాసిటీలో మా ప్రాంతంలో నిర్వాసితులకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వడం లేదు.మా సమస్యను కలెక్టర్, ఇతర అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.భూములు కోల్పోయిన నిర్వాసితులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు.మీరు అధికారంలోకి వచ్చాక ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలి.నిర్వాసితుల్లో చదువుకున్నవారికి శిక్షణ ఇచ్చి ఫార్మా కంపెనీల్లో శాశ్వత ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.తాడి గ్రామం ఫార్మాసిటీని ఆనుకుని ఉంది. కాలుష్య కోరల్లో మా గ్రామం చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఫార్మా కంపెనీలు విడుదల చేసే కాలుష్య జలాలతో భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.జగన్ చేతగాని పాలనతో 28శాతం నిరుద్యోగిత రేటుతో ఎపిని దేశంలోనే నెం.1 స్థానంలో నిలిపాడు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చాక 2.30లక్షల ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి, మాటతప్పి మడమ తిప్పాడు.తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురైన యువత గత నాలుగున్నరేళ్లుగా సగటున రోజుకొకరు చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నారు.చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం కాలుష్య రహిత పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంది.పరవాడ ఫార్మాసిటీ కారణంగా భూగర్భజలాలు కలుషితం కాకుండా ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటుచేస్తాం.ఫార్మాసిటీ వల్ల పరిసర గ్రామాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం.ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి చట్టప్రకారం రావాల్సిన పరిహారాన్ని అందజేస్తాం.నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలిస్తాం.ఉద్యోగాలు వచ్చేవరకు యువగళం నిధి కింద నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇస్తాం.