– అధికారంలోకి రాకముందు ముద్దులు పెట్టిన వ్యక్తి, నేడు పేదలు, ఆడబిడ్డలపై పిడిగుద్దులు కురిపిస్తున్నాడు.
– టీడీపీ అధికారప్రతినిధి నాగుల్ మీరా
పాదయాత్రసమయంలో అక్కచెల్లెమ్మలకు మూడుదశల్లోమద్యపాననిషేధం చేస్తానని చెప్పిన పెద్దమనిషి, ముఖ్యమంత్రై రెండున్నరేళ్లు దాటినా కూడా ఏపీలో వీధివీధినా మద్యం అమ్మకాలు సాగిస్తూ, రాష్ట్రంలో మద్యాన్ని ఏరులైపారిస్తున్నాడని టీడీపీ అధికారప్రతి నిధి నాగుల్ మీరా ఆరోపించారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
గతప్రభుత్వంలో మద్యంపై రూ.9వేలకోట్ల ఆదాయం వస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2019-20లో రూ.20వేలకోట్లు వచ్చింది. మందుతాగేవారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్న ముఖ్యమంత్రి, పేదలరెక్కలకష్టాన్ని దోచుకుంటున్నాడు. గతంలో మద్యం బాబులు వారిబలహీనతను అధిగమించడానికి కేవలం వారిసంపాదనలో రూ.100లు మాత్ర మే ఖర్చుపెట్టేవారు.
కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమాఅని ఇప్పుడు అదేమందుబాబులు వారిరోజుకూలీసొమ్ము రూ.500లలో రూ.400లను మద్యానికే తగలేస్తున్నాడు. అదికూడా ఈ ప్రభుత్వం అమ్మేనాసిరకం మద్యంతాగుతూ, తనజీవితం నాశనంచేసుకోవడమే గాకుండా, కుటుంబం మొత్తాన్ని నాశనంచేసుకుంటున్నాడు. జగన్మోహన్
రెడ్డి ప్రభుత్వంలోనే ఇన్ని నా సిరకం మద్యంబ్రాండ్లు ఎందుకున్నాయి? ముఖ్యమంత్రికి రాత్రికలలో ఏదిగుర్తొస్తే, అది తెల్లారే సరికి మద్యంబ్రాండ్ పేరురూపంలో వస్తుంది. రూ.4, లేదా రూ.5కి లీటర్ స్పిరిట కొని, దాన్ని సీసాల్లో నింపి, అందమైన లేబుల్స్ అతికించి, మద్యంపేరుతో మార్కెట్లోకి వదులుతున్నారు. గతప్రభుత్వాలు అభివృద్ధి, పారిశ్రామికరంగ పురోగతి, సంక్షేమానికి సంబంధించి సమీక్షలుచేస్తే, ఈ ముఖ్యమంత్రి మద్యం అమ్మకాలపై సమీక్షలు చేసేస్థితికి దిగజారాడు.
ఆఖరికి ఈప్రభుత్వంలో కలెక్టర్లు మద్యం అమ్మకాలు ఎలా పెంచాలనేదానిపై దృష్టిపెడితే, పోలీసులు పొరుగు రాష్ట్రాలనుంచి మద్యంరాకుండా కాపలాకాస్తున్నారు. సంవత్సరానికి రూ.30వేలకోట్లవరకు మద్యం అమ్మకాలు సాగించాలనేదానిపైనే కలెక్టర్లు, ఇతరఅధికారులు దృష్టంతాఉంది. గంటకు రూ.10కోట్లు, రోజుకి రూ.85కోట్లు చొప్పున ఏడాదికి రూ.30వేలకోట్ల వరకు మద్యం అమ్మకాలుసాగించాలనే లక్ష్యాలను జగన్మోహన్ రెడ్డి అధికారులకు అప్పగిం చాడు. పేదవాడిజీవితంతో, పేదల ఆరోగ్యంతో ఆడుకునేలా ఈ ముఖ్యమంత్రి లక్ష్యాలు విధిస్తున్నాడు.
ఆడబిడ్డలు తమతాళిబొట్లను కోల్పోతూ, బిడ్డలకడుపులుకూడా నింపలేక రోదిస్తు న్నా కూడా ముఖ్యమంత్రి తనమద్యం దోపిడీని ఆపడంలేదు. గతంలో ముద్దులు పెట్టి, ఆడబిడ్డలు, అవ్వాతాతలు, యువతను మోసగించినజగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వారిపై పిడిగుద్దులు కురిపిస్తూ, రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడు. నేనున్నా…నేను విన్నా.. నేను చేస్తాను అన్నపెద్దమనిషి ఇప్పుడు ప్రజలవీపులుచరుస్తూ, వారిజేబులు కొల్లగొడుతున్నాడు .
గత ప్రభుత్వంలో బేవరేజెస్ కంపెనీలకు క్వార్టర్ మద్యంసీసాకు రూ.5లు చెల్లిస్తే, ఈ ప్రభుత్వం రూ.27లు చెల్లిస్తోంది. అదనంగా ఒక్కోసీసాకు చెల్లిస్తున్న రూ.22లు జగన్ జేబులోకే వెళుతోంది. ఈ ప్రభుత్వం అవినీతికోసమే మద్యందుకాణాల్లో నగదుచెల్లింపులు జరుపుతోంది. డిజిటల్ చెల్లింపులు అయితే, దోపిడీకి అవకాశం ఉండదనే, డబ్బుకట్టాలనే నిబంధన అమ లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం కమీషన్లకు బలిచేస్తూ, శవాలపై చిల్లర ఏరుకుంటోంది. దశలవారీగా మద్యనిషేధం అన్నజగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అందుకు విరు ద్ధంగా దశలవారీగా వివిధరూపాల్లో మద్యంఅమ్మకాలు పెంచుకుంటూ పోతున్నాడు.
ఈ ముఖ్యమంత్రి ఏదశలో మద్యపాననిషేధం దిశగా అడుగులువేశాడో వైసీపీనేతలు, మంత్రులు చెప్పాలి. అధికారంలోకి వచ్చినప్పటినుంచి మద్యంధరలను కొండంతపెంచిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు గోరంతతగ్గించి గొప్పులుచెప్పుకుంటున్నాడు. రూ.12లు అమ్మేక్వార్టర్ మద్యాన్ని రూ.250కి అమ్ముతున్న ముఖ్యమంత్రి, దానిలో రూ.20లుతగ్గించడం మరింత అమ్మకాలు పెంచడానికి కాదా అనిప్రశ్నిస్తున్నాం. రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చి, వనరులు సద్వినియోగంచేసుకొని ఆదాయాన్ని పెంచడంచేతగాని జగన్మోహన్ రెడ్డి, పేదవాడి బలహీన తను సొమ్ముచేసుకుంటూ తనవ్యక్తిగత ఆదాయంపెంచుకోవడం దుర్మార్గం కాదా?
ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను వంచించి అధికారంలోకివచ్చిన జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయం. ముఖ్యమంత్రి పేదలను దోచుకోవడానికి తీసుకొచ్చిన ఓటీఎస్ స్కీమ్ పై ఆడబిడ్డలంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వారంతా 2024ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని వన్ టైమ్ సీఎంగా మార్చడానికి ఇప్పటికే కంకణంకట్టుకున్నారు.