– ప్రజల నుంచి ఎక్కువగా వాటిపైనే ఫిర్యాదులు ఉన్నాయి
-విద్యుత్ శాఖ అధికారులకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి
– ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలు సమస్యలపై శ్రీరామ్ కు వినతులు
– రూ.5.92 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన శ్రీరామ్
ధర్మవరం: పట్టణంలోని చాలా కాలనీల్లో విద్యుత్ సమస్యలు ఉన్నాయని.. వాటి పరిష్కారం దిశగా అధికారుల చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సూచించారు. ధర్మవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు కాలనీల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు ఇచ్చారు.
ఇందులో ముఖ్యంగా విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్ లైన్లు, స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్లు వంటి సమస్యల గురించి శ్రీరామ్ కు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, భూ సమస్యలు, పింఛన్లు వంటి వాటిపై కూడా అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఇటీవల ఎక్కువగా విద్యుత్ సమస్యలు కనిపిస్తున్నాయని.. వాటిపైనే ప్రజలు ఎక్కువగా అర్జీలు ఇచ్చారన్నారు. ప్రజలు ఎక్కువగా విధ్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వీటి పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య తెలిసిన వెంటనే అధికారులు దృష్టికి తీసుకెళ్తున్నామని ఆయన వివరించారు. పట్టణంలో చాలా చోట్ల డ్రైనేజీ సమస్యలు కూడా కనిపిస్తున్నాయని… మున్సిపల్ అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించనున్నట్లు తెలిపారు. పింఛన్లు, రేషన్ కార్డులు త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందని…. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీరామ్ తెలిపారు…
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన శ్రీరామ్
ధర్మవరం నియోజకవర్గంలోని పలువురికి పరిటాల శ్రీరామ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ధర్మవరం, తాడిమర్రి, ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాలతో పాటు పట్టణానికి చెందిన మొత్తం 15 మందికి రూ.5.92 లక్షలు విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు పరిటాల శ్రీరామ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ .. ధర్మవరం నియోజకవర్గంలో 23 నెలల్లో 375 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించినట్లు చెప్పారు. మొత్తం 2 కోట్ల 40లక్షల రూపాయల సాయం అందిందన్నారు. గతంలో ఎప్పుడు ఈ విధంగా సాయం అందించిన దాఖలాలు లేవన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదారంగా స్పందిస్తున్నారని… అడిగిన వెంటనే తగిన సాయం చేస్తున్నారని అన్నారు. వైద్యం విషయంలో ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని శ్రీరామ్ స్పష్టం చేశారు.