– పెదపాడు మండలంలో అప్పన్న వీడు గ్రామంలో బుధవారం సాయంత్రం దాదాపు 500 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
– మండలంలో మొత్తం 726 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ
– దొంగే తిరిగి దొంగ దొంగ అని అరిచినట్లు ఉంది జగన్ నిర్వాకం
– దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పెదపాడు: వరద బాధితులను ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ఎలాంటి రాజకీయ పక్షపాతాలకు తావు లేకుండా, వరద ముంపుకు గురైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున అండగా ఉంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
రామిలేరు వరద ముంపుకు గురైన పెదపాడు మండలం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన దాదాపు 726 కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తరపున నిత్యవసర సరుకులు అందించేలా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చర్యలు చేపట్టారు.
బుధవారం సాయంత్రం పెదపాడు మండలం అప్పన్న వీడు గ్రామంలో జరిగిన నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాదాపు 500 కుటుంబాలకు స్వయంగా నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “వరద సహాయ చర్యల్లో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు ఎంతో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు తాము అండగా ఉన్నాం అనే భరోస కల్పించటం ఎంతో అభినందనీయం అని అన్నారు.
వరద సహాయక చర్యల్లో భాగంగా పెదపాడు మండలంలోని పలు గ్రామాల్లో ముంపుకు గురైన దాదాపు 726 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ మంచి నూనె, కేజీ కంది పప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు, కేజీ పంచదార చొప్పున తక్షణ సహాయాన్ని అందించడం జరుగుతుందని అన్నారు.