Suryaa.co.in

Andhra Pradesh

బాధితుడికి ఇంటి దగ్గరకే ఆహారం, మంచినీరు, మందులు

– మంత్రి కొలుసు పార్ధ సారధి

విజయవాడ: ప్రతి వరద బాధితుడికి ఇంటి దగ్గరకే ఆహారం, మంచినీరు, మందులు అందించా లని రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన విజయవాడలోని కృష్ణలంక,సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వరద భాదితులను పరామర్శించారు.

వరద ప్రభావం తగ్గటంతో భాదితులకు ప్రభుత్వం నుంచి మెరుగైన సహాయం త్వరలోనే అందుతుందని,అధికారులు నష్టాన్ని అంచనా వేస్తారని మంత్రి తెలియచేశారు.రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు వల్ల ఆస్తి నష్టం,ప్రాణ నష్టం కలగకుండా నివారించ గలిగామని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలను తీసుకుంటున్నారని తెలిపారు.

అదే విధంగా రాష్ట్ర మంత్రులు,ఇతర ప్రజా ప్రతినిధులు,అధికారులు అందరూ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారని మంత్రి పార్థ సారథి పేర్కొన్నారు.ఇంకా కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచి ఉందని అవసరమైన చోట నీటిని మోటార్లతో బయటకు బయటకు తోడిస్తామని మంత్రి భాదితులకు హామీ ఇచ్చారు.

మంత్రి పార్థ సారథి స్వయంగా ట్రాక్టర్ నడిపి సింగ్ నగర్ బాధితుల వద్దకు వెళ్ళి కూర గాయలు,పండ్లు, పాలు,మజ్జిగ,మంచి నీరు,ఆహర పదార్ధాలను అందించారు.సింగ్ నగర్లో పరిస్థితులు క్రమేపి మెరుగుపడుతున్నాయని చెప్పారు.భాధితులు దగ్గరికే మంత్రులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు సహాయం అంద చేస్తారని మంత్రి బాధితులకు భరోసా కల్పించారు.

ఎవరూ అధైర్య పడవద్ధుని,ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం ప్రతి బాధితుడికి అందచేయటం జరుగుతుందని మంత్రి పార్ధ సారధి స్పష్టం చేశారు. భాదితులకు సహాయం అందించటంలో స్వచ్ఛంద సంస్థలు,వివిధ వర్గాలు,ప్రజా సంఘాలు బాగా పని చేస్తున్నాయని మంత్రి అన్నారు. రామలింగేశ్వర నగర్లోను,విజయవాడ కృష్ణలంకలోని వరదభాదితుల శిబిరంలో ఏలూరు శాసన సభ్యులు బి.రాధా కృష్ణ ఏర్పాటు చేసిన దుప్పట్లు,ఆహార పదార్ధాలను మంత్రి బాధితులకు తులకు అంద చేశారు.

ఈ కార్యక్రమాల్లో శాసన మండలి సభ్యులు పి.అశోక్ బాబు,మాజీ మంత్రి, శాసన సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ,మాజీ శాసన సభ్యులు గంటా మురళి,పార్టీ నేతలు బొప్పన భువకుమార్, రొండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE