Suryaa.co.in

Andhra Pradesh

సభ్యతా, సంస్కారం లేని వ్యక్తి ఎమ్మెల్యే కిలారి

– వంచన, మోసం, కమిషన్లు దండుకోవటంలో దిట్ట ఎమ్మెల్యే కిలారి
– ధ్వజమెత్తిన ధూళిపాళ్ళ నరేంద్ర

మోసం, వంచినా కమిషన్లు ఎమ్మెల్యే కిలారి రోశయ్య రక్తం లోనే ఉందని సభ్యత, సంస్కారం లేని వ్యక్తి ఎమ్మెల్యే రోశయ్య అని పొన్నూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ మోసం అనేది నా రక్తంలోనే లేదని లక్షల మంది ముందైనా ఒకరి ముందైనా ఒకేలా ఉంటానని తెలియజేశారు.

రోడ్డు విస్తరణకు సంబంధించి మేము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మమ్మల్ని తిడితే ప్రజలకు ఒరిగేది ఏమిటి రోశయ్య అని ప్రశ్నించారు?…
రోడ్డు విస్తరణ కోసం నిధులు వచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని రోశయ్య ఒప్పుకోవటం సంతోషకరం. 2018 లో వచ్చిన జీవోలో నాలుగు రెట్లు TDR బాండ్లు ఇవ్వాలని ఉన్నదని రోశయ్య చెప్తున్నారు మరి అందులో పొన్నూరు పేరు ఉన్నదో, లేదో అనే పేపర్ను మాత్రం చూపించడం లేదు. ప్రెస్ మీట్ లలో మీరు చూపించే పేపర్లు అందరికీ పంచి పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి.

పొన్నూరు జి బి సి రోడ్డు విస్తరణ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం చేయాలని మేం తీర్మానించాం అందుకోసం రూ 20 కోట్లు ఆర్ అండ్ బి నుంచి పురపాలక సంఘం నుండి 1.61 కోట్ల నిధులు సమీకరించి కలెక్టర్ కు జమ చేసాం ఇవన్నీ అధికార పత్రాలే. రూ 38 కోట్లలో రూ 21.50 నిధులు మంజూరు చేయించాం.

మిగిలిన నిధులు నువ్వు తెస్తే లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది కదా?. లబ్ధిదారులకు పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వకుండా గాలిపోగేసి గాలితనంతో మాట్లాడుతున్నావ్ రోశయ్య… ఎవరికో అన్యాయం జరిగితే ఎవరో కోర్టుకు వెళితే నాకేం సంబంధం రోశయ్య?… నా స్థలం ఉండి నాకు అన్యాయం జరిగితే నేను కోర్టుకు వెళ్తా, భావనారాయణ స్వామి ఆలయ భూములు కాజేసే నీ మాస్టర్ స్కెచ్ కి లాంటి వాటికి ఖచ్చితంగా అడ్డుపడతా…

ఐలాండ్ సెంటర్లోని సైఫుల్లా భవనం ఆర్ అండ్ బి రోడ్ లోనే ఉంది. అక్కడ వరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం రోడ్డును విస్తరించాలని ప్రతిపాదనలు ఉన్నాయి మార్గం మధ్యలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ మెట్లు కూడా తొలగించాలని ప్రతిపాదించాం. ఇది బాపట్ల రేపల్లె కాదు మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఇది పొన్నూరు గుర్తుపెట్టుకో రోశయ్య…

TDR బాండ్ల ప్రతిపాదన తెచ్చిందే రోశయ్య, మేము తెచ్చిన నగదు తోనే 45 అడుగుల వరకు రోడ్డును విస్తరించాలని చూస్తే ఆర్ అండ్ బి మరియు ఉన్నతాధికారి అభ్యంతరాలు చెప్పిన మాట వాస్తవం కాదా రోశయ్య?
లబ్ధిదారులకు పూర్తి పరిహారం ఇవ్వకుండా భవనాలు కూల్చడానికి బందోబస్తు కావాలని పోలీసులకు మున్సిపల్ కమిషనర్ ఎలా లేఖ రాశాడో, కమిషనర్ లేఖలో ఆంతర్మేమిటో, ఎవరిని బెదిరించటానికో పొన్నూరు పుర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాను.

మేము మీ సొంత వ్యాపారాల గురించో, నువ్వు ఎక్కడ ఉంటున్నావో, ఎవరితో పడుకుంటున్నావో అని మేము ఎప్పుడూ మాట్లాడటం లేదు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆయన భార్యను ట్రస్ట్ బోర్డ్ లో నియమించిన తర్వాతే ఆలయ భూముల కేటాయింపు ప్రారంభమైందని స్వయంగా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ భూ కేటాయింపు చేసిన సమయంలో రాజా సమావేశానికి హాజరు కాలేదని చెప్తున్నారు. కేవలం రాజా అడ్డగోలు కేటాయింపులకు అడ్డుపడినందునే ఎమ్మెల్యే రోశయ్య ఆయన సతీమణి ని ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా నియమించారు.

చుక్కల భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే దేవాదాయ శాఖ చేసింది. నంబూరు లో నీకు డబ్బులు పోగేసి ఇచ్చిన వాళ్లు నీ గెలుపు కోసం కష్టపడి చుక్కల భూముల్లోనే ఉన్నాయి. అలాగే నారాకోడూరు ఫారెస్ట్ లేకపోయినప్పటికీ ఫారెస్ట్ భూమిగా నమోదు అయింది. వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పరిష్కరించాం.

చరిత్ర గురించి మాట్లాడితే చాలా మాట్లాడాలి… నేను అరెస్టు అయిన సమయంలో నాపై, నా కుటుంబీకులపై, నా భార్య జ్యోతిర్మయి పై చాలా మాట్లాడారు నేను మాట్లాడుతుంది చాలా తక్కువ వ్యక్తిగత అంశాల జోలికి వస్తే చరిత్ర చాలా ఉంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మేము దేనికైనా సిద్ధమే మీ చుట్టూ ఉండే ఆకు రౌడీలు సంగతి నాకు బాగా తెలుసు నేను కళ్ళు తెరిస్తే ఒక్కడు ఉండడు.

ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మాదాల వెంకటేశ్వరరావు, పొన్నూరు పట్టణ మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ అహ్మద్ ఖాన్ మరియు బండ్లమూడి బాబురావు, పొన్నూరు మండల ఉపాధ్యక్షులు గనిపిశెట్టి రామకృష్ణ, పొన్నూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎద్దు సోంబాబు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ, మాజీ కౌన్సిలర్లు ఆకుల సాంబశివరావు, తానికొండ లక్ష్మీనారాయణ చౌదరి, పిన్నమనేని కోటేశ్వరరావు, అనిశెట్టి వీరబాబు మరియు నాయకులు బాజీ సాహెబ్, తోట ప్రసాదు, గరిగంటి సాయిబాబు, వేంపాటి కోటేశ్వరరావు, నిమ్మకూరి ధర్మారావు, పాములపాటి సాయి కృష్ణ, సుదీర్ చంద్, పొన్నగంటి వాసు, ఆరే వరప్రసాద్, గర్నెపూడి అనిల్, పండు, సముద్రాల ఆశీర్వాదం, రాజు,సురేష్, సుభాని, లాడెన్, బాజీ తదితరులు పాల్గొన్నారు

 

LEAVE A RESPONSE