Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల అందరివాడు

– కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర పురోభివృద్ధి
– కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

కె. గంగవరం /రామచంద్రపురం : ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనతోనే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం పామర్రులో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి సుభాష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. సకల జనుల శ్రేయస్సే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమం, నిరుద్యోగ నిర్మూలన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గన్ని కృష్ణ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, గత వైసిపి పాలనలో అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా నష్టపోయామన్నారు. ఐదేళ్లలో జరిగిన విధ్వంశాన్ని తిరిగి గాడిలో పెట్టే విధంగా కూటమి పాలన సాగుతుందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ పట్ట బద్రుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న నాయకుడని, ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖర్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు.

రామచంద్రపురం ఎన్నికల ఇన్చార్జి కాకినాడ రామారావు ఎమ్మెల్సీ ఎన్నికల తీరు, ఓటు వేసే విధానాన్ని వివరించారు. రాష్టాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు తన అపార అనుభవం ద్వారా విదేశీ పెట్టుబడులు రప్పించి రాష్ట్రభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE