Suryaa.co.in

Telangana

జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనం సమర్పించారు. ఆషాఢ మాసం బోనాల ప్రారంభం సందర్భంగా కుమ్మరులతో కలిసి తొలి బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. గోల్కొండ బంజారా దర్వాజ వద్ద గల కాసాల రోహిత్ పటేల్ నివాసం నుంచి నిర్వహించిన నజర్ బోనం ఊరేగింపులో పాల్గొన్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ చారి నివాసంలో నిర్వహించిన బంగారు బోనం ఉత్సవంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE