మాగంటి గోపినాథ్ స్మృతిలో వెంగళరావు నగర్ డివిజన్ సంతాప సభ
సన్నాహక సమావేశంలో డా. శ్రవణ్ దాసోజు పిలుపు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యారావు ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే , గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులు దివంగత నేత మాగంటి గోపినాథ్ స్మృతిలో జూన్ 29, ఆదివారం సాయంత్రం 6 గంటలకు సిద్దార్థనగర్ కమ్యూనిటీ హాల్‌లో జరగనున్న సంతాప సభ ఏర్పాట్లపై జరిగిన సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు , సభను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై విలువైన మార్గదర్శకాలు ఇచ్చారు.
అయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాగంటి సేవలు అమూల్యమైనవి. ఆయన స్మృతిలో నిర్వహించనున్న సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆయనకు ఘన నివాళులు అర్పించాలని కోరుతున్నానుఅని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సభా ప్రాంగణ ఏర్పాట్లు, వాహన సదుపాయాలు, ప్రజల సౌకర్యం, ప్రచార కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించబడింది. ఆయా అంశాల అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడిందని కార్పొరేటర్ దేదీప్యారావు తెలిపారు.