Suryaa.co.in

Telangana

అందుబాటులో ఆధునిక వైద్యం

-కేసీఆర్ హయంలోనే విద్య,వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు
-కార్పొరేట్ విద్యలో ఫెయిల్యూర్లు ఎక్కువ
-ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు
-గురుకులాలలో సీట్ల కోసం వత్తిడి
-నిబంధనల ప్రకారమే సీట్ల కేటాయింపు
-ప్రైవేటుఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉత్పనం కాదు
-మంత్రి జగదీష్ రెడ్డి
-నల్లగొండ జిల్లా కేంద్రంలో ట్రస్మా ఆధ్వర్యంలో విద్యా సదస్సు
-ప్రైవేటు ఉపాధ్యాయ,ఉపాధ్యాయనిలకు ఉత్తమ విద్యా సేవా అవార్డులు
-ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి
-పాల్గొన్న శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి
-సభకు అధ్యక్షత వహించిన ట్రస్మా అధ్యక్షుడు కోడి శ్రీనివాస్, పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి,పాపిరెడ్డి బి -ఆర్ యస్ నేత సుంకరి మల్లేష్ గౌడ్ తదితరులు

ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ ఆసుపత్రిలలో ఆధునిక వైద్యం అందుబాటులోకీ వచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.క్యాన్సర్,అంకాలజీతో సహా అన్ని ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకీ వచ్చాయన్నారు.బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రవైట్ పాఠశాలల యజమాన్యాల ఆధ్వర్యంలోనీ ట్రస్మా నిర్వహించిన విద్యా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అంతకు ముందు ట్రస్మా అధ్యక్షుడు కోడి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రవైట్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్ పై మంత్రి జగదీష్ రెడ్డి పై విదంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలోనే విద్యా,వైద్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయన్నారు.ఏకకాలంలో 8 మెడికల్ కళాశాలలు మంజూరు చేయడం తో పాటు వచ్చే విద్యాసంవత్సరంలో మరో 9 మెడికల్ కళాశాలల ఏర్పాటు చేయబోతున్న సాహసం ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.

హెల్త్ కార్డులు అక్కర లేకుండానే ప్రభుత్వ ఆసుపత్రిలలో ఆధునిక వైద్యం అందుబాటులో ఉందన్నారు.అటువంటి సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.మెడికల్ కళాశాలల ఏర్పాటు ద్వారా ప్రతి జిల్లా కేంద్రంలో వందలాది మంది ప్రభుత్వ డాక్టర్లు అందుబాటులో ఉన్నారన్నారు.కాదని ప్రవైట్ ఆసుపత్రికి వెడితే శరీరం తో పాటు జేబు గుల్ల అవుతుందన్న విషయాన్ని విస్మరించ రాదన్నారు.విద్య రంగంలోనూ సంచలనాత్మకమైన మార్పులు సంభవించాయనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకా ఏర్పాటు చేసిన 1000 కీ పైగా గురుకులాలో పెరిగిన సీట్ల రద్దీయే నిదర్శనమన్నారు.

2014 కు పూర్వం ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లకు డిమాండ్ ఉంటే ఇప్పుడు గురుకులలాలకు డిమాండ్ పెరిగిందన్నారు.అయితే నిబంధనల మేరకే సీట్ల కేటాయింపులు ఉంటాయన్నారు.ప్రభుత్వ పాఠశాలల్తో పోల్చి చూస్తే కార్పొరేట్ విద్యా సంస్థ లలో ఫెయిల్యూర్ లు ఎక్కువన్నారు.ప్రవైట్ పాఠశాలలో పనిచేస్తున్న వారికి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉత్పనం కాదన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన ప్రైవేట్ ఉపాధ్యాయ,ఉపాధ్యాయనిలకు ఉత్తమ విద్య సేవ అవార్డులను అందించి సత్కరించారు.

LEAVE A RESPONSE