మోడీ కార్పొరేట్ ప్రధాని…సామాన్యుల ప్రధాని కాదు

-మోడీ బినామీ అదానీ
-ప్రజలు కేంద్రంగా,సమస్యలే ఇతివృత్తంగా కేసిఆర్ జనరంజక పాలన
-రాష్ట్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో లేవు
-మూసీనదిపై టంగుటూరు వద్ద 8 గ్రామాలకు ఉపయోగపడే బ్రిడ్జి కట్టాలని గత ముఖ్యమంత్రులకు ఎందుకు మనసు రాలేదు
అందుకే దేశానికి కేసిఆర్ నాయకత్వం కావాలని అన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది
-త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ మోడీని ప్రశ్నిస్తే…దుర్మార్గంగా ఎంపి పదవి నుండి డిస్ క్వాలిఫై చేశారు
-కాంగ్రెస్ దద్దమ్మలు ఆ సమస్యపై మాట్లాడక..మా మీద పడి ఏడుస్తున్నరు
-రేవంత్ రెడ్డివి అన్ని పచ్చి అబద్ధాలు,పసలేని ఆరోపణలు
-ప్రధాని మోడీ చర్యలు ఎమర్జెన్సీనీ తలపిస్తున్నాయి
-మోడీ దేశ సంపదను దోచుకుంటున్నాడు
-ప్రశ్నిస్తే..సీబీఐ,ఈడి కేసుల పేరిట వేధిస్తున్నారు
– చేవెళ్ల నియోజవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య,ఎంపీ రంజిత్ రెడ్డి,జెడ్పి చైర్మన్ అనిత రెడ్డి లతో కలిసి గురువారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్ధాపన,ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

12 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు శంకుస్థాపన,మన ఊరు మన బడి ద్వారా ఆధునీకరించిన జిల్లా పరిషత్ మరియు ప్రైమరీ పాఠశాల ల ప్రారంభోత్సవము,టంగుటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల మాట్లాడారు… తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేంద్రంగా,సమస్యలే ఇతివృత్తంగా కేసిఆర్ నాయకత్వంలో జనరంజక పాలన అందుతుందని మంత్రి తెలిపారు. మూసీనదిపై టంగుటూరు వద్ద 8 గ్రామాలకు ఉపయోగపడే ఈ బ్రిడ్జి కట్టాలని గత ముఖ్యమంత్రులకు ఎందుకు మనసు రాలేదని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ కు తెలంగాణ లోని ప్రతి పల్లె బాగోగులు తెలుసన్నారు. రాష్ట్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో లేవని స్పష్టం చేశారు. అందుకే దేశానికి కేసిఆర్ నాయకత్వం కావాలని అన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతోందన్నారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటూ దేశ వ్యాప్తంగా ఆహ్వానిస్తున్నారు అని తెలిపారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ మోడీని ప్రశ్నిస్తే…దుర్మార్గంగా ఎంపి పదవి నుండి డిస్ క్వాలిఫై చేశారనీ మండిపడ్డారు.

కాంగ్రెస్ దద్దమ్మలు ఆ సమస్యపై మాట్లాడక..మా మీద పడి ఏడుస్తున్నరని ఏ సమస్య మీద మాట్లాడాలో కూడా సోయిలేని స్థితిలో ఉన్నారన్నారు. కేసిఆర్ ను ఆయన కుటుంబాన్ని విమర్శించే రేవంత్ రెడ్డి తన కాంగ్రెస్ పార్టీ నాయకున్ని కాపాడుకునే ఇంగిత జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నాడని అన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రధాని మోడీపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేసేవి అన్ని పచ్చి అబద్ధాలు,పసలేని ఆరోపణలే అని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ చర్యలు ఎమర్జెన్సీనీ తలపిస్తున్నాయనీ అన్నారు.

అదానీ వ్యాపారి మాత్రమే అని అదానీ పేరుతో మోడీ దేశ సంపదను దోచుకుంటున్నాడన్నారు. మోడీ కి బినామీ అదానీ అని ఆరోపించారు. నరేంద్ర మోడీ తమ కార్పొరేట్ మిత్రులకు మాత్రమే ప్రధానిలా వ్యవహరిస్తున్నారని,ఆయన సామాన్యుల ప్రధాని కాదనీ అన్నారు. ఇది ప్రశ్నిస్తే..సీబీఐ,ఈడి కేసుల పేరిట వేధిస్తున్నారనీ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మోడీ గద్దె దిగేవరకు కేసిఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాడని మంత్రి వేముల స్పష్టం చేశారు.

Leave a Reply