Suryaa.co.in

Political News

ప్రజల పట్ల మోడీ అభిమానం

ప్రధాని మోదీ మాత్రం మన దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించలేదు? కరోనా కాలంలో కూడా ప్రజలపై పెట్రో ధరల భారం ఎందుకు మోపారు? అసలు పెట్రోల్-డీజిల్‌పై పెంచిన డబ్బును మోదీ ఏం చేశారు? ఎవరికి ఖర్చు చేశారు?.. ఇదీ సగటు భారతీయుడి మస్తిష్కాన్ని తొలుస్తున్న ప్రశ్న. అవును. ఆ ఆదాయాన్ని మోదీ ఏం చేశారో తెలుసుకునే ప్రయత్నమే ఇది.
మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఏ సంస్థకు ఆ సంస్థ అప్పులు లేకుండా, సెల్ఫ్ సఫీషియంట్ గా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పెట్రోల్, డీజిల్ మీద పెరుగుతూ వస్తూ ఉంది. అదియును గాక crude మన దేశంలో దొరికే వస్తువు కానందున, డాలర్ రేటు పెరిగినప్పుడల్లా పెరుగుతూ వస్తూ ఉంది.
మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల పాలనలో, పెట్రోలియం బాండ్ల అప్పు గల్ఫ్ దేశాలకు వేలకోట్లలో ఉంది. ఆ అప్పుతీర్చే బాధ్యత కూడా మోడీ మీద పడింది. అందువల్ల ఈ మధ్య రోజుల్లో పెట్రోల్, డీజిల్ మీద సామాన్యుడు భరించలేనంతగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆదాయం, కరోనా సమయంలో ప్రజల ఖర్చులకు ,వ్యాక్సిన్ కు 35 వేల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చుపెట్టి , దేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.
మన ఆర్మీని చైనాకు ,పాకిస్థాన్ కు ధీటుగా ఏ సమయంలో యుద్ధం వచ్చినా వారి కంటే ఎక్కువగా యుద్ధ సామాగ్రినికొని, మన సైనికులకు చేరవేసింది. బార్డర్ ప్రాంతాలలో కొండలను తవ్వి టన్నల్ ద్వారా రోడ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేసి, అవసరమైతే రోడ్లమీద యుద్ధవిమానాలు దిగుటకు రన్ వే లు తయారు చేశారు . చైనా , పాకిస్తాన్ బార్డర్ కు మూడు కిలోమీటర్ల ఇవతలగా మన భూభాగంలో, మన వేలాది మంది సైన్యాన్ని అధునాతన ఆయుధాలు సమకూర్చి, అన్ని కాలాలలో వాతావరణానికి తట్టుకొని టైట్ గా పర్మినెంట్ గా ఏర్పాటు చేశారు.
దీనికంతటికీ వేల కోట్లు ఖర్చవుతుంది ఈ డబ్బంతా పెట్రోల్, డీజిల్ గ్యాస్ మీద వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది .మరి సామాన్య మానవుడు కానీ, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. శత్రు దేశాలనుండి ముందు మన దేశాన్ని రక్షించవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది .
పెట్రోల్ గ్యాస్ డీజిల్ పెరిగింది అని గగ్గోలు పెట్టే ప్రతి మనిషి కూడా, నేను చెప్పిన పై అవసరాలకు ఖర్చు పెట్టారని తెలిస్తే అర్థం చేసుకొని అభినందిస్తారు. మోడీ సామాన్యుడు భరించలేనంత గా పెట్రోల్, డీజిల్ పెరిగిందని.. పెట్రోల్ మీద లీటర్ కు ఐదు రూపాయలు, డీజిల్ మీద లీటర్ కు పది రూపాయలు లెక్కన ఎక్సైజ్ డ్యూటీ (అంటే కేంద్రానికి వచ్చే ఆదాయం) తగ్గించుకున్నారు .
రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లీటర్ పెట్రోల్ మీద నలభై ఒక్క రూపాయ ,ఒక లీటర్ డీజిల్ మీద 39 రూపాయలు ఆదాయం వస్తుంది.కానీ పెరిగితే మొట్టమొదట నిందించేది కేంద్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు టాక్స్ పేరుతో అదనంగా ఒక రూపాయి వసూలు చేస్తుంది (రాష్ట్రంలో రోడ్లు దుస్థితి మనకు తెలుసు) కేంద్ర ప్రభుత్వాన్ని డీజిల్,పెట్రోల్ పెరిగినప్పుడల్లా నిందించే పెద్ద మనుషులు,మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఐదు రూపాయలు పెట్రోల్ మీద,పది రూపాయలు డీజిల్ మీద తగ్గించమని అడగండి.
బీజేపీ పాలిత కొన్ని రాష్ట్రాల్లో, లీటర్ మీద పది రూపాయలు తగ్గించి ఉన్నారు .నేను పేద ప్రజల కోసం పుట్టాను.. సంక్షేమం నా ధ్యేయం అని అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పెట్రోల్, డీజిల్ మీద పది రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేద్దాం.

– కరణం భాస్కర్
బిజెపి
నెల్లూరు
7386128877.

LEAVE A RESPONSE