– డ్వాక్రా మహిళలతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖాముఖి
పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీకి పేదల కష్టాలు తెలుసు.రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్ముతు తండ్రికి సహాయం చేసేందుకు మోదీ టీ గ్లాసులు కడిగారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆడ పిల్లలను చంపుతున్నారు. హర్యానాలో వెయ్యి మంది అబ్బాయిలు పుడితే.. అమ్మాయిలు 750మందే పుట్టేది. నరేంద్ర మోదీ ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలనే భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం తీసుకువచ్చారు.
ఆడ బిడ్డల మీద వివక్షతను రుపుమాపేందుకు ప్రభుత్వాలు ఇళ్లను వారి పేరు మీద ఇస్తున్నారు. కట్టెల పొయ్యి మీద వంట చేస్తే అనేక రోగాల బారిన పడేవారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఉజ్వల యోజన పథకం కింద పేదలకు మోదీ ఉచితంగా గ్యాస్ ఇచ్చారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టారు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33శాతం మహిళలకు సీట్లు వస్తాయి. రాజకీయంగా మహిళలు ఎదగాలని మోదీ 33శాతం రిజర్వేషన్లు కల్పించారు.10 కోట్ల ముస్లిం మహిళల కోసం మోదీ పెద్దన్నగా ట్రిపుల్ తలాక్ ను రద్దు చేశారు. మారుమూల గ్రామాలకు కరెంట్ ను తీసుకెళ్లిన ఘనత మోదీకే దక్కుతుంది. అయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.
జన్ దన్ యోజన కింద ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు కేంద్రం ఇచ్చింది.పొదుపు సంఘాలకు ప్రతి ఊరికి మోదీ డ్రోన్లు పంపించారు.ఒక సంఘంలో పది మంది ఉంటే ఇరువై లక్షలు కేంద్రం ఇస్తుంది. కేంద్రం ఇచ్చే డబ్బులతో ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలి. చిన్న చిన్న వ్యాపారాలను పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన కాంగ్రెస్ ప్రభుత్వం, పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.