ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళలో రక్షణ కరువు

-బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి

ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో గత మూడురోజుల క్రితం స్థానిక SC హాస్టల్ లో విద్యార్థినుల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం అందరికి తెలిసిందే ఈ రోజు ఆ హాస్టల్ని సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులు పరిశీలించి కనీస వసతులు లేవు, బాలికల వసతి గృహంలో కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత ఊడితే ఎంత అని ధ్వజం ఎత్తారు. సొంత భవనాలు లేకుండా ప్రయివేటు భవనాలలో హాస్టల్స్ ని ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించలేని దౌర్బాగ్య పరిస్థితిలో ప్రభుత్వం అధికారులు ఉండికూడా భరోసా కల్పించలేని స్థితిలో సంక్షేమ హాస్టల్స్ అధికారులు, సరైన మౌళిక సదుపాయాలు, భద్రత కల్పించాలి అని శిల్పా రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.

Leave a Reply