Suryaa.co.in

Telangana

దేశంలో ప్రతి వ్యవస్థ వ్యవసాయ రంగంతో ముడి పడి ఉంది

-గావ్ చలో కార్యక్రమంలో భాగంగా అమీర్పేట్ గ్రామ రైతులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖాముఖి

మోదీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం అని రైతులతో అన్నారు. అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో ప్రతి వ్యవస్థ వ్యవసాయ రంగంతో ముడి పడి ఉందని, భావించి రైతుల మేలుకోసం మోదీ ప్రభుత్వం అనెక చర్యలు తీసుకుంది. కరెంట్ కోతలు లేని దేశాన్ని నిర్మించే దిశగా చర్యలు తీసుకున్నారు.

రైతుకు సబ్సిడీ ఎరువులు అందిస్తుంది. రైతులకు ఎరువుల బస్తాను చూపించి బస్తాపై ప్రింట్ అయిన ప్రైస్ కే ఎరువులు కొనాలని రైతులకు సూచించారు. దీంతో స్పందించిన రైతులు అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. రైతుల సమక్షంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్తాపై ప్రింట్ చేసిన ధరకే అమ్మేలా డీలర్ లకు ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు

LEAVE A RESPONSE