రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలి

-సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అగ్రహం
-“ఎక్స్” వేదికగా రేవంత్ రెడ్డి వైఖరి పై మండిపాటు

కెసిఆర్ పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తోంది. తెలంగాణలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తోంది. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయం రేవంత్ రెడ్డి మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ ను సాధించిన కెసిఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం.

Leave a Reply