నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెబితే మీరు ఎవ్వరికీ జై కొట్టమంటే వాళ్ళకి 1000 సార్లు జై కొడతా .
100 రోజుల్లో వెనక్కి తెస్తానన్న నల్ల ధనం ఏది..??
ప్రతి పౌరుడికి పంచుతాను అన్న 15 లక్షలు ఏవి..??
35 రూపాయలకు పెట్రోలు.. ఏది..??
రూపాయికి 40 డాలర్లు.. ఏవి.. ??
“ఒక తలకు పది తలలు” ఏవి ??
పఠాన్ కోట్ నిందితులు ఎక్కడ ??
మాకు అధికారం వస్తే చొక్కా కాలరు పట్టుకుని, లాక్కొస్తాం అన్నా దావూద్ ఇబ్రహీం ఎక్కడ?
ముంబై మీద తీవ్రవాద దాడికి బాధ్యుడైన హాఫీజ్ సయిద్ తల ఎక్కడ ?
ప్రజాధనం పంది కొక్కుల్లాగా తిని, హాయిగా దేశం నుండి పారిపోయిన మీ పార్టీ MP విజయ్ మాల్య ఎక్కడ?
ప్రజాధనాన్ని కొల్లగొట్టి, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకుని, హాయిగా విదేశాలలో జల్సా చేస్తున్న నీరవ్ మోడీ ఎక్కడ?మేహుల్ చోస్కీ ఎక్కడ ?
లడఖ్ నుండి చైనాను, టిబెట్ సరిహద్దు దాకా తరిమి కొడతాం అన్నారు. ఎక్కడ దాకా తరిమారు?
ఇక మాట్లాడ్డాలు లేవు.. కళ్లెర్ర జేస్తాం. 56 ఇంచుల ఛాతీతో నలిపేస్తాం అన్నారు.ఏది? ఎక్కడ?
రైతు ఆదాయాన్ని పదిరెట్లు చేస్తానన్నారు.ఎక్కడి దాకా వచ్చింది?
మేడ్ ఇన్ ఇండియా అని, అమెరికాకి ఎగుమతి చేస్తాము అన్నారు.ఎక్కడి దాకా చేశారు?
బేటీ బచావో అన్నారు. ఆడబిడ్డలను రేపులు చేసి చంపుతున్న మీ MP లకు, MLA లకు శిక్షలేవి ?
బేటీ పడావో అన్నారు. ఎంతమంది ఆడబిడ్డలను చదివించారు? ఎన్ని బడులు కట్టారు?
పౌరులకు నాణ్యమైన వైద్యం అందించడంలో మీరు సాధించినది ఏమిటి?
రైతుల ఆత్మహత్యలు ఆపడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి?
అవినీతిని నిర్మూలించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటి?
నత్త నడక నడుస్తున్న న్యాయ వ్యవస్థను గాడిలో పెట్టి, పౌరులకు సత్వర న్యాయం అందించేందుకు.. మీరు తీసుకున్న చర్యలు ఏమిటి?
ఒక్క పూట తిండితో జీవనం గడుపుతూ వస్తున్న 35% పేదలకు, రెండోపూట తిండిని కూడా దూరం చేస్తున్న ధరల పెరుగుదల సమస్యపై మీరు తీసుకున్న చర్యలు ఏమిటి ?
ఈ దేశంలో గంటకు 4గురు మహిళలు, లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు.. రోజుకు 6 మంది అత్యాచారాలకు బాధితులుగా మారుతున్నారు.వాటికి నివారణ చర్యలు ఏమిటి?
సమాధానం చెప్పండి..
కావాలంటే మరో 1000 సార్లు మీరు చెప్పిన ప్రతి వారికి జై కొడతా..
శత్రుదేశాలు మన సైనికులను చంపుతుంటే…ఫోనులో ఆప్లికేషన్లు తొలగించేసి,, ఏదో ఊడబోడిచాం అని సంకలు గుద్దుకునే మీరా దేశాన్ని కాపాడే వీరులు?
పాకిస్తాన్ వాడు దాడి చేస్తే.. ఈ దేశ పౌరులైన ముస్లింల మీద..
చైనా వాడు దాడి చేస్తే… ఈ దేశ పౌరులైన కమ్యూనిస్టుల మీద..
అమెరికా వాడు దాడి చేస్తే.. ఈ దేశ పౌరులైన క్రైస్తవుల మీద..
ఆవు పేరుతో, మతం పేరుతో.. ఈ దేశ పౌరులైన దళితుల మీద దాడులు చేస్తూ,, విషం కక్కుతూ ఉండడమేనా.. మీ వీరత్వం? మీ దేశభక్తి?
ఒక్క సారి మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి మీ వల్ల నా దేశానికి ఏమి ఉపయోగం..?
– మహేష్
చెల్లాపూర్
దుబ్బాక నియోజకవర్గం..