– ఉత్తర భారతంలో మళ్ళీ విరిసిన కమలం
“మూడు విషయాలు ఎక్కువ కాలం దాచబడవు- సూర్యుడు, చంద్రుడు మరియు సత్యం” – బుద్ధుడు
ఇక్కడ సత్యం – యూపీ ప్రజలు నిజాయితీ మరియు సమర్థతను ఎన్నుకోవడం.
• యూపీ ఎన్నికల చరిత్రలో అవినీతి, మతపరమైన అల్లర్లు ప్రధాన సమస్యలు కాకపోవడం ఇదే మొదటిసారి.
•యూపీ ప్రజలు కులం లేదా మతం ఆధారంగా కాకుండా అభివృద్ధి కోసం మాత్రమే ఓటు వేయడం ఇదే మొదటిసారి.
యూపీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ , నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ , తెలంగాణ రాష్ట్ర సమితి వంటి చాలా రాజకీయ పార్టీలు.. కొన్ని మీడియా బీజేపీని అధికారం నుండి దూరంగా ఉంచాలనే ఏకైక ఉద్దేశ్యంతో, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి మద్దతు ఇచ్చాయి.
అఖిలేష్ యాదవ్ గత 5 సంవత్సరాలలో యుపిలో చురుగ్గా పని చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు మాత్రమే క్రియాశీలకంగా మారారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ క్రియాశీలకంగా లేదు. క్యాడర్ సందిగ్ధంలో ఉంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రమైన పోటీదారుగా పరిగణించబడలేదు.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఎప్పటిలాగే గమ్యం – లక్ష్యం లేకుండా ఉంది. ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ అవకాశాలపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. అందుకే, 6 నెలల నుండి అఖిలేష్ యాదవ్‌ను ప్రధాన పోటీదారుగా ప్రచారం చేయడం జరిగినది . ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే అసలు ప్రచారం మొదలైంది. బీజేపీని ఓడించేందుకు ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ఒక మతం, కొన్ని కులాల వారు అఖిలేష్ యాదవ్‌కు ఓటు వేయాలని ఒక వ్యూహాన్ని ప్రచారం చేశారు.
యోగి ప్రభుత్వంపై జాట్లు, ముస్లింలు, యాదవులు, బ్రాహ్మణులలో మరియు వ్యవసాయ చట్టాల పట్ల వ్యతిరేకత బిజెపి ఓటమికి కారణమవుతాయని వివిధ సిద్ధాంతాలు ప్రచారం చేయబడ్డాయి.
ప్రజలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేశారు?
ప్రజలు బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణాలు..
మోడీ యోగి ఫ్యాక్టర్.నిజాయితీ, దేశభక్తి, అంకితభావం మరియు కష్టపడి పనిచేయడం మోడీ మరియు యోగి లక్షణాలు. మోడీ యోగి ద్వయం కింద 2017 నుండి గత 5 సంవత్సరాల బిజెపి ప్రభుత్వంలో
ఉత్తరప్రదేశ్ భారీ పురోగతి మరియు మార్పు చూసింది.లా అండ్ ఆర్డర్- లా అండ్ ఆర్డర్ పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల ఉంది. ఉక్కు పిడికిలితో యోగి ప్రభుత్వం గ్యాంగ్స్టర్లతో వ్యవహరించింది.ప్రజలు, ముఖ్యంగా మహిళలు సురక్షితంగా ఉన్నారు.
సంక్షేమ చర్యలు- నిరుపేదల చిరకాల అవసరాలను తీర్చడానికి బిజెపి ప్రభుత్వం చాలా నిశితంగా అనేక సంక్షేమ చర్యలను అమలు చేసింది. యుపిలో పిఎం కిసాన్ ద్వారా 2.4 కోట్ల మంది, పిఎం ఉజ్వల ద్వారా 1.5 కోట్లు, జన్ ధన్ ఖాతాలుద్వారా 7.8 కోట్లు మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా 1.3 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. పేదలకు 42 లక్షల ఇళ్లను అందించారు. దాదాపు రూ.5 లక్షల కోట్లు నేరుగా నిరుపేద లబ్ధిదారులకు చేరాయి.మౌలిక వసతులు మెరుగుపరచడానికి భారీ ప్రాధాన్యత ఇవ్వబడింది.అనేక దీర్ఘకాల ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయబడ్డాయి.
అభివృద్ధి – పైన పేర్కొన్న అన్ని చర్యల వలన “స్టేట్ ఆఫ్ గూండా రాజ్” నుండి “ఇన్వెస్ట్మెంట్ హబ్”గా యూపీ మారింది. యూపీ గత 5 ఏళ్లలో రూ.17.05 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. వ్యాపారం చేయడం లో సౌలభ్యం లో 17వ స్థానం నుండి 2వ స్థానానికి మెరుగుపడింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు దేశంలో రెండవ అతిపెద్దది.
కోవిడ్ నిర్వహణ- యోగి ప్రభుత్వం సంక్షోభాన్ని చక్కగా పరిష్కరించింది. వనరుల సముచిత వినియోగంతో, ప్రభుత్వం సరైన ఆరోగ్య సంరక్షణను అందించింది. సుమారు రూ.36000 కోట్ల రేషన్ పేదల ఇంటింటికీ పంపిణీ చేశారు.సనాతన ధర్మ పునరుద్ధరణ కై భారతదేశ ప్రజల కలలను నిజం చేసేందుకు కృషి చేసింది. ఎట్టకేలకు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ పునర్వైభవం పొందింది.నిజాయితీ- అన్ని ప్రభుత్వ కార్యకలాపాలలో అవినీతిని రూపుమాపడం మరియు అత్యంత నిజాయితీతో వ్యవహరించడం యూపీ లో ఇదే తొలిసారి.
ఇతర పార్టీలను ప్రజలు ఎందుకు తిరస్కరించారు?
ఎస్పీ, బిఎస్పీ , మజ్లిస్ మరియు ఆరయెల్డీ యొక్క లక్షణాలు
కుటుంబ పార్టీలు- అన్నీ కుటుంబ ఆధారిత పార్టీలు, వీటిలో నాయకుడు ఒక కుటుంబానికి చెందినవాడు మాత్రమే. కుల ఆధారిత పార్టీలు- ఈ పార్టీలు ఒక నిర్దిష్ట కులంపై ఆధారపడి ఉంటాయి
అవినీతి- ఈ పార్టీలన్నీ ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నాయి. బుజ్జగింపు – ఈ పార్టీలన్నీ సంతుష్టీకరణ మరియు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడంలో ముందున్నాయి.
అభివృద్ధి వ్యతిరేకులు- ఈ పార్టీలన్నీ యూప లో అభివృద్ధి లేదా మౌలిక సదుపాయాల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. యూపీ ప్రజలు మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ ని, ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలోని కాంగ్రెస్‌ను మరియు ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ ని విశ్వసించలేదు.
సమాజ్‌వాదీ పార్టీ పాలనలో అరాచకం
యాదవ్ కుటుంబం, అది ములాయం సింగ్ యాదవ్ లేదా అఖిలేష్ యాదవ్ కావచ్చు, అన్ని రంగాలలో యూపీ ని నాశనం చేసింది. వారి పాలనలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మాఫియా, గ్యాంగ్స్టర్లకు స్వేచ్ఛనిచ్చింది.
2013-2017 మధ్య అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు సాయంత్రం 5 గంటల తర్వాత, మహిళలు తిరగలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రదేశాలు పురుషులకు కూడా ప్రమాదకరంగా ఉండేవి. వారి పాలనలో మౌలిక సదుపాయాలు శిథిలావస్థకు చేరాయి.
2017కి ముందు యూపీ లో పెట్టుబడుల గురించి ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. అఖిలేష్ యాదవ్ పాలనలో దాదాపు రూ.97000 కోట్ల విలువైన పెట్టుబడులు కార్యరూపం దాల్చలేకపోయాయి.
వారి పాలనలో యుపిలో అత్యధికంగా మతపరమైన అల్లర్లు జరిగాయి. ముజఫర్‌నగర్ అల్లర్లు అఖిలేష్ యాదవ్ హయాం లో జరిగాయి, ఇందులో వేలాది మంది మరణించారు. యూపీలోని ఖైరానా వంటి ప్రాంతాల్లో హిందువుల వలసలు జరిగిన మాట వాస్తవం.పాలన యొక్క అన్ని అంశాలలో అవినీతి. రాష్ట్ర సమస్యలను వదిలేసి సినీ తారలు పాల్గొన్న అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం సఫాయి పండుగను జరుపుకుంది.
అంతిమ విజయం సత్యంకే సాధ్యం
అభివృద్ధి, భద్రత, ఆత్మగౌరవం మరియు జాతీయ ప్రయోజనాల పరంగా కనిపించే సానుకూల మార్పును చూసిన ప్రజలు మోడీ-యోగి ద్వయం నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలను వారు స్పష్టంగా గుర్తించారు. ప్రజలు కుటుంబ పాలన, బుజ్జగింపు మరియు కుల ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలను తిరస్కరించారు.
2017 వరకు ఉన్న అరాచకపాలన గుర్తున్న ప్రజలు సమాజ్ వాదీ పార్టీని నిరాకరించారు.యూపీ ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా మరియు రాజకీయ విశ్లేషకుల ప్రధాన లక్ష్యం అన్ని విధాలుగా బీజేపీని ఓడించడమేనని, దానికి అనుగుణంగానే పని చేశారన్నది నిజం. దురుద్దేశపూరితమైన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గ్రహించారు.
యోగి అందించిన భద్రత మరియు సంక్షేమం కోసం మహిళలు ప్రధానంగా బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇది ఖచ్చితంగా జరగాల్సిన మార్పు మరియు ఇది భారత రాజకీయాల భవిష్యత్తు గమనాన్ని మారుస్తుంది.ప్రజలు కోరుకునే మార్పు కేవలం – “సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్”
