అన్నీ దారులు మూసుకుపోయాక మూర్ఖుడు దేశభక్తి అనే ముసుగు వెనుక దాక్కుంటాడు
దేశభక్తి నిరూపించడానికి ప్రొఫైల్ మార్చనవసరం లేదు సార్. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి, ఆకలి చావుల నుంచి, నిరుద్యోగం నుంచి, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల నుంచి , నల్లధనం నుండి,మతం నుండి, దేశాన్ని కాపాడండి చాలు.
అదే మీరు ఇచ్చే ఆగస్టు 15 బహుమానం అంతేకానీ.. కరోనా వస్తే చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి, ఆగస్ట్ 15 వస్తే ప్రొఫైల్ పిక్ మార్చండి అనే అసంబద్ధమైన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వడం కాదు. ఒకవేళ మారిస్తే, దేశంలో పెట్రోల్ 50కి ఇస్తారా? గ్యాస్ 400కి ఇస్తారా? సామాన్యులు వాడే నిత్యావసర వస్తువులపై విధించిన GST రేట్లు తొలగిస్తారా..? కార్పొరేట్ వర్గాలకు అప్పనంగా కట్టబెడుతున్న ప్రజల ఆస్తులను, ప్రభుత్వరంగ సంస్థలను యథాతథంగా ఉంచగలరా? నూతనంగా భారీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్మించగలరా? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల భర్తీ హామీని నిలబెట్టుకోగలరా? భారీ స్థాయిలో పెరిగిన నిరుద్యోగ రేటును తగ్గించగలరా..?
నోట్ల రద్దుతో అనేక రంగాలను అతలాకుతలం చేసి, నల్లధన్నాని తిరిగి తీసుకొని వచ్చి, ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షలు వేస్తాను అన్న హామీని అమలు చేయగలరా..? విశాఖ ఉక్కును, LICని ప్రైవేటీకరణ నుండి మినహాయింపు ఇవ్వగలరా? రాష్ట్రాల హక్కులపై దాడిని ఆపగలరా? భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేసే విధానాలను అమలు చేయకుండా ఉండగలరా? మెజారిటీ వాదంతో బలవంతంగా మనువాదపు విధానాల అమలును, అప్రజాస్వామిక పద్దతులను ఆపగలరా? విభజన హామీలను అమలు చేయగలరా? ప్రత్యేక హోదాను కేటాయించగలరా..? రాజ్యాంగ బద్ధమైన విధానాలను అనుసరిస్తూ , సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని ఇవన్నీ చేయండి అప్పుడు మీరు చెప్పినట్లు మేము చేస్తాము. మీరు చెప్పినా చెప్పకపోయినా , జాతీయ జెండా ఎప్పుడూ మా గుండెల్లో రెపరెపలాడుతూనే ఉంటుంది.
– అనుమలశెట్టి శ్రీనివాసులు
అడ్వకేట్,
టౌన్ కాంగ్రె స్ అధ్యక్షుడు
కావలి