వెంట్రుక వాసిలో … మిల్లీగ్రాముల బరువుతో నిన్ను ఎవరో కాలు పెట్టి…పతకం రాకుండా ఆపారని కార్టూన్లు పంచిన ప్రకాష్ రాజ్ ల నోరు మూయించినందుకు…నీకో పతకం.
రెజ్లింగ్ కమిటీ లైంగిక వేధింపులు….అంతా ఉత్తుత్తిదే అని చాటి చెప్పినందుకు నీకో పతకం.
రైతుల ఉద్యమం సుదీర్ఘ నాటక పరంపర అని…అందులో నీలాంటి అన్నిరంగాల సెలబ్రిటీలు కూడా నటించగలరని ఇలా చేతిలో చెయ్యేసి చెప్పినందుకు నీకో పతకం.
రాజకీయాల్లోకి రాకముందే…ఇంత మంచి వ్యూహం తో…పరిణతితో…దేశ ప్రతిష్ఠను కూడా లెక్కచెయ్యని…నీ దూరదృష్టికి మరో పతకం.
ఆ రోజు రాత్రంతా అన్ని కిలోలు బరువు తగ్గడానికి నువ్వు పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరు కాకుండా…రాహుల్ రెండు చేతులూ పెట్టి ఆపిన తీరు చూసి…ఇంకో పతకం ఇద్దరికీ.
నీకు కాంగ్రెస్ ఒక గొప్ప సరైన వేదిక…దాన్ని ఎప్పుడో ఎంచుకుని కూడా మధ్యలో పతకాలు సాధించావు చూడు….దానికి మరో పతకం…
ఇప్పుడు నీ కీర్తి బావుటా పతాక స్థాయికి చేరింది…నిజానికి ఇంక ఏ పతకాలు..పథకాలు అక్కర్లేదు.
నువ్వో గూటి చిలుకవు..ఆ గూటికే చేరావు.
ఇప్పటివరకూ గుబులు పడ్డ క్రీడా ప్రేమికులే నీ క్రీడలో బుడం కాయలు…
శృంగార క్రీడలో కట్టు జారకుండా పట్టు సాధించినంత తేలిగ్గా హర్యానా జూలానా నుంచి చులాగ్గా… సీటు కొట్టేసావు చూడు…దానికి కూడా ఒక పతకం.
ఏదేమైనా.. నువ్వీ దేశపు ఆడబిడ్డవు…నువ్వు పతకం తెచ్చుకోక… కన్నీరు పెట్టావేమో అనుకుని… పాపం మన ప్రధాని కూడా తల్లడిల్లారు చూడు…అదొక్కటే కొంచెం గిల్టీగా ఉంది. ఆయన కూడా మాలాగే కొంచెం ఎమోషనల్…మేమంతా ఇంతే. ఇంతకీ..మీరు కలిసిన రోజు… రాహుల్ నీ చేతిలో చెయ్యేసి చెప్పిన బాసలు ఒకసారి చెప్పవా? గెలిచాక చెబుతావా…దేశం మళ్ళీ మరోసారి ఓడాకా చెబుతావా?
– శ్రీహరి మంగళంపల్లి