Suryaa.co.in

Andhra Pradesh

కోవూరు నియోజకవర్గం పాడి పంటలతో సుభిక్షంగా వుండాలి

– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

కోవూరు : విఘ్నేశ్వరుడి దయతో విఘ్నాలు తొలిగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. కోవూరులోని బజారు సెంటర్లో TNC యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొని ఆమె విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి వినాయక చవితి శుభాకాంక్షలు అందచేశారు.

అనంతరం మాట్లాడుతూ గత 24 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా వినాయక చతుర్థి ఉత్సవాలు నిర్వహిస్తున్న బజారు సెంటర్ TNC యూత్ సభ్యులను అభినందించారు. బజారు సెంటర్లో వినాయక ఉత్సవ బాధ్యతలు చేపట్టే యువకులు ఏడాది లోపే ఉద్యోగ వ్యాపారాలలో స్థిర పడే ఆనవాయితీ కొనసాగుతుందన్నారు. ఈ సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్న యువకులు వచ్చే ఏడాది కల్లా స్వామి వారి ఆశీస్సులతో ఉద్యోగ వ్యాపారాలలో స్థిర పడాలని ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE