నీలి ఆకాశం నిండా ..వెలుగులే నిండుగ పండా ..
పండగొచ్చినట్టే ..హరివిల్లు నవ్వినట్టే ..
ప్రతి తెల్లవారు పల్లె పెళ్లి కూతురైనట్టే ..
శుభోదయం మనసా ..
ఇది నవోదయం తెలుసా ..
తరంగాల సరస్సా ..
మేఘాలతో ఉషస్సా ..
తడిసిన నేల పైన.. నును లేతకిరణమేనా
మంచు ముత్యం మెరిసినదౌనా ..
పూలరెక్కల చెక్కిలి పైనా ..
సుప్రభాత పవనమే సెలయేటి తరగలయేనా ..
సరిగంగ స్నానమేచేసే ప్రకృతి పరవశించేనా ?
ఇనోదయ లేత కాంతులతో ఊరువాడా మేలుకొలుపేనా ?
రంగవల్లులతో వాకిళ్లు స్వాగతాలు చెప్పెనా ..
గోధూళులే ధూపమేస్తుంటే పల్లె కళ పెరిగెనా !
– రాధిక ఆండ్ర