సినిమా టికెట్లు ఆన్లైన్ లోనే ప్రభుత్వం అమ్మాలి … నేను సమర్ధిస్తాను …నాకు చిన్న సందేహం ఉంది. క్లారిటీ కోసం…పార్టీ రంగుల కోసం 1300 కోట్ల ప్రజల సొమ్మును వాడేశారు. అప్పుడు లేని నష్టం సినిమా టికెట్లు అమ్మితేనే ప్రజలకు నష్టం. ఏడాది క్రితం ఉన్న లక్షా 40 వేల 108 కాంట్రాక్ట్ ని, ఒక్కో అంబులెన్స్ కి నెలకు 2లక్షల 60 వేలకు పెంచి, విజయ సాయి రెడ్డి అల్లుడు కంపెనీ అరబిందో ఫార్మసికి దోచిపెట్టి, ఒక్కో అంబులెన్స్ మీద నెలకు లక్ష రూపాయలు పెంచి ప్రజల సొమ్ము కాజేస్తే లేని నష్టం, సినిమా టిక్కెట్లు అమ్మితేనే వస్తుంది.
రేషన్ సంచుల కోసం భారతి గారికి 750 కోట్ల కాంట్రాక్టు ఇస్తే ప్రజలకు నష్టం రాదు. సినిమా టికెట్లు కొంటేనే ప్రజలకు నష్టం. మద్యం రేట్లు పెంచి అమ్మితే నష్టం ప్రజలకు నష్టం రాదు… ఎందుకు అంటే రేట్లు పెంచితే తాగడం మానేస్తారు … కానీ 5 ఏళ్లకు రాబోయే మద్యం మీద ఆదాయం చూపి అప్పులు తెచ్చారు. అంటే 5 ఏళ్లు మద్యం అమ్మాలి .. మరి రేట్లు రూపాయికి 4 రేట్లు పెంచి మరో 5 ఏళ్ళు అమ్మాలి. అయినా ప్రజలకు నష్టం లేదు. కానీ సినిమా టికెట్లు అమ్మితేనే ప్రజలకు నష్టం?
డ్వాక్రా మహిళల పొదుపు మీద కూడా అప్పులు తేవాలి. ప్రభుత్వం లో ఉన్న పెద్ద పెద్ద కాంట్రాక్టులు అన్ని రేట్లు పెంచి మీరు తీసుకోవాలి . మద్యం రేట్లు, నిత్యావసర ధరలు, కరెంటు బిల్లులు, బస్సు ఛార్జీలు, రిజిస్ట్రేషన్ వాల్యూ చార్జీలు , దేవస్థానం ల టికెట్లు రేట్లు,రూములు రేట్లు, చెత్త మీద పన్ను, ఇంటి పన్నులు, సిమెంటు, ఇసుక ,ఐరెన్, ఇలా అన్ని పెంచినా ప్రజలకు రాని నష్టం సినిమా టికెట్లు మాత్రం కొంటే మాత్రం నష్టం వస్తుంది.
ఆన్లైన్ లో ఇసుక అమ్మడం కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి సాఫ్ట్వేర్ తయారు చేసి, ప్రభుత్వం వేబ్రిడ్జి లు పెట్టి , ఆఫీసులు కట్టి, ఇసుకను నిల్వ పోసి , ఇసుక అమ్మడం కోసం వందల కోట్లు రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. 1000 రూపాయలకు దొరికే ట్రాక్టర్ ఇసుకను 5 వేలు చేసి చివరికి ఆన్లైన్లో అమ్మడం చేతకాక, ఇసుక కోసం తయారు కోట్లు పోసి కట్టిన ఆఫీసులు, వేబ్రిడ్జి లు, సాఫ్ట్వేర్ లు పక్కన పెట్టి చివరికి ప్రవేటు వ్యక్తులకు ఇచ్చారు … మీరు ఇసుక అమ్మడానికి చేసిన ఖర్చు ఎంత?? అమ్మితే వచ్చిన లాభం ఎంత ?
ఆన్లైన్ లో ఇసుక అమ్మడం చేతకాలేదు. ఎప్పుడు సాఫ్ట్వేర్ పని చేయక పోవడం, ఇసుక బుక్ చేసినా రాకపోవడం అన్ని చూసారు జనం. ఇప్పుడు సినిమా టికెట్లు అమ్మడం కోసం ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసి, ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి మళ్ళీ తయారు చేయడానికి అయిన ఖర్చుల భారం అంతా, ప్రజా ఖజానా కొల్లగొట్టి తీసుకుంటారు. సాఫ్ట్వేర్ లు ఊరికే వస్తున్నాయా ?ఎన్ని వందల కోట్లు ఖర్చు చేయాలి ?
ఇసుకే ఆన్లైన్లో అమ్మలేక తోక ముడిచారు ఇప్పుడు సినిమా టిక్కెట్లు ఎలా అమ్మగలరు? ఆన్లైన్ లో సర్వర్ మొరాయించడం వలన రేషన్ బియ్యం, పింఛన్లు సరిగా కూడా ఇవ్వలేని మీరు.. సినిమా టికెట్లు ఎలా అమ్మగలరు? ఇప్పుడు 5 వేల కోట్లు పెట్టి సినిమా టికెట్లు అమ్మకం కోసం సాఫ్ట్వేర్ తయారు చేయించి, నిర్మాతల సొమ్ము కూడా తినేసి ఆ వచ్చే ఆదాయం చూపించి, అప్పులు తెద్దామని మీ ప్లాన్ అంతేగా?
ఆ వచ్చిన డబ్బులు ఎలా ఇస్తారంటే.. ధాన్యం ఇచ్చిన రైతులకు 6 నెలలు అయినా ఇంకా ఇస్తూనే ఉన్నారు. అన్నం పెట్టిన రైతునే 6 నెలలు పంట సొమ్ము ఇవ్వడానికి ఏడిపించిన జగన్ సర్కారు.. ఇంక నిర్మాతల సొమ్ము వాళ్ళ దగ్గరికి వెళ్తే గోవిందా …. గోవిందా… రైతులు కష్టాలు చూశారుగా …ఇప్పుడు చెప్పండిరా టికెట్లు ఆన్లైన్ అమ్మిద్దామా ? ప్రజల సొమ్మును రాళ్ళ పాలు చేస్తున్న సర్కారును నిలదీద్దామా …
– సాయిరాం ప్రసాద్