నెల్లూరు వేదికగా మత్స్యకార గర్జన

కేంద్రమంత్రి మురుగన్ రాక
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడి
మత్స్యకారుల హక్కుల కాలరాసే జిఒ 217 ను వెంటనే ఉపసంహరించాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ని మత్స్యకారులకు గొడ్డలి పెట్టుగా ఉన్న జివో పై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి లేఖలపై స్పందించకపోవడం తో ఉద్యమ కార్యచరణ కు నడుం బిగించాం.గత మాసం జారీ చేసిన జిఒ 217 యుక్క నిభద్దతను ప్రశ్నిస్తురాష్ట్ర మత్స్యకారుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 12 వతేదీ న లేఖ ద్వారా తొమ్మిది ప్రశ్నలు సంధించడం జరిగింది. ప్రభుత్వానికి లేఖ రాసి పక్షం రోజులు పూర్తి అయినప్పటికీ ఇప్పటి వరకు లేఖ లోని తొమ్మిది ప్రశ్నలకు ఎటువంటి సమాధానం ప్రభుత్వం ఇవ్వక పోగా , రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు భాద్యతా రహితంగా పత్రికా ముఖంగా వ్యాఖ్యానించడం మనమందర గమనించాం.
బిజెపి రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలియచేయడ మైంది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మత్స్య సహకార సంఘాలు, సంస్థలు ఈ జిఒ మీద పెద్ద ఎత్తున నిరసన తెలియ చేస్తున్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినెట్లు ఉండడం భాదాకరమైన విషయం.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిఒ 217 రద్దుకై రాష్ట్ర వ్యాప్తం ఉద్యమానికి నాంది పలుకుతున్నది. అక్టోబర్ 7వ తేదీన నిర్వహించే మత్స్యకార గర్జన సభకు కేంద్ర మత్య్స శాఖ మంత్రి ఎల్ మురగన్ ముఖ్య అతిధిగా విచ్చేయచున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న మత్స్య కార సంక్షేమ పధకాల అమలు తీరు పై సమీక్షిస్తు 217 జిఒ వల్ల ఏర్పడే సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయ బోతున్నాం. ఈ సందర్భంగా మత్స్యకారుల ఉద్యమం పై పాటల సీడీని సోమువీర్రాజు విడుదల చేశారు.
రహాదారు ల నిర్మాణానికి సంబంధించి చర్చకు సిద్దంగా ఉన్నాం దీని పై ప్రభుత్వం సిద్దంగా ఉందా అని ప్రశ్నించారు. కేంద్రం వేల కోట్ల రూపాయలతో జాతీయరహదారులు నిర్మాణం చేస్తుంటే రాష్ట్రప్రభుత్వం రహదారుల పై గోతులు కూడా పూడ్చలేక పోతోందని దుయ్యబట్టారు. గ్రామాల్లో లింకు రోడ్లు గ్రామీణ సడక్ యోజన పధకంలో సిమ్మెంట్ రోడ్లు నిర్మాణం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు రావడంలేదని యద్దేవా చేశారు.జాతీయ రహదారులు ఏవిధంగా నిర్మాణం జరుగుతుందో మీడియా సమక్షంలో చూపించేందుకు కూడా తాము సిద్దంగా ఉన్నామన్న విషయాన్ని వివరించారు
బద్వేలు ఉపఎన్నికకు సంబంధించి జనసేన , బిజెపి చర్చించి అభ్యర్ధిని ఖరారు చేస్తామని ఇప్పటికే చాలా విషయాలు మిత్రపక్షంతో చర్చించామని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వీర్రాజు వివరించారు. మాకు జనసేనకు క్లారిటీ ఉందని విలేకర్లకు చిరునవ్వుతో సోము వీర్రాజు సమాధానం చెప్పారు.
ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి, ఫిషర్ మెన్ స్టేట్ కన్వీనర్ బొమ్మిడి క్రుష్ణ, ఒబిసి మోర్చా రాష్ట్రనాయకుడు దాసం ఉమామహేశ్వరరాజు, జిల్లా అధ్యక్షుడు బొబ్బూరి శ్రీరాం, మీడియా రాష్ట్ర కన్వీనర్ లక్ష్మీపతి రాజా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply