– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
మైలవరం: జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ చెప్పిన లెక్కల ప్రకారం హెరాయిన్ లక్షా తొంభై ఆరు వేల కోట్లు అంటే సుమారు రెండు లక్షల కోట్లు విజయవాడలో ఆషీ ట్రేడింగ్ కంపెనీ జీఎస్టీని అడ్డం పెట్టుకొని మార్కెట్ లోకి వెళితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడడు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అవినీతిని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎండగట్టిన ప్రతిపక్షాలను తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారి దగ్గర నుండి గ్రామ స్థాయి నాయకులు పై బూతులు మాట్లాడే బూతు మంత్రులు బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారు.రాష్ట్రంలో గత ఆరు రోజులుగా జరుగుతున్న సంఘటనలు హెరాయిన్, గంజాయి పై చర్చలు జరుగుతున్నాయి వీటిన్నింటినీ పక్కదోవ పట్టించడానికి బూతుల మంత్రులు రంగంలోకి దిగుతున్నారు.
జగన్ రెడ్డి కి నొప్పి వస్తే బూతుల మంత్రులు బయటికి వచ్చి బూతు సాహిత్యాన్ని, బూతు పంచాంగాన్ని వాడుతున్నారు ఒక్కసారి ఒక్కసారి అని అధికారంలోకి వచ్చింది దీనికోసమేనా? స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలలో బాధ్యత గల మంత్రులు, శాసనసభ్యులు, అధికార పార్టీ నాయకులు ఈ రకమైన భాష వాడారా ?
పరిపాలనా వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులతో జగన్ రెడ్డి బూతుల పంచాంగం చదివిస్తున్నాడు టిడిపి హయాంలో వ్యవసాయ పంచాంగం చదివిస్తే జగన్ రెడ్డి పరిపాలన వైఫల్యం, అసమర్థత, అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి ప్రజల దృష్టి మరల్చడానికి కులాల పేరిట, మతాల పేరిట ఈ అసహ్యకరమైన భాష బూతుల భాష, బూతుల పంచాంగం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులుచే చదివిస్తున్నారు.
ప్రజాస్వామ్యవాదులు అంతా కూడా దీనిని ఖండించాలి ఈ బూతుల పంచాంగం రాష్ట్ర సరిహద్దులు దాటి వెళుతున్నాయి ఇందుకోసమేనా ఈ అరాచక శక్తులకు ఒక్కసారి అని అవకాశం ఇచ్చిందని ప్రజలు గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచిస్తున్నారు. రెండు లక్షల కోట్ల కుంభకోణం ప్రజల దృష్టి మరల్చడానికి జగన్ రెడ్డి, మంత్రులు, వాళ్ళ నాయకులు బూతుల పంచాంగం చదువుతున్నారు.