Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలనలో కుప్పంలో అభివృద్ధి పరుగులు

-ముఖ్యమంత్రి నిర్ణయంపై ముస్లిం ఉద్యోగులు హర్షం
– కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ తో రాష్ట్రం అభివృద్ధి
-“బిమ్ స్టెక్” తో దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల సంబంధాలు బలోపేతం
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి

40 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు కుప్పంను మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ డివిజన్ గా కానీ చేయలేకపోయారని. అభివృద్ధి సంగతి అటుంచితే కనీసం తాగు నీరు కూడా అందించలేకపోయారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి చేయలేని అభివృద్ధి మొదటి సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి కుప్పంలో అభివృద్దిని పరుగులు పెట్టించారని, అది కూడా చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని అన్నారు.

ముస్లింలకు పరమ పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని, సాయంత్రం ఉపవాస దీక్ష విరమించే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ముస్లిం ఉద్యోగులు గంట ముందే ప్రభుత్వ కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందిని అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై ముస్లిం ఉద్యోగులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ లో 6 న్యూక్లియర్ రియాక్టర్లు ఏర్పాటుకు కేంద్రం అనుమతించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని, ఆర్థిక పురోగతి సాధిస్తుందని అన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని పరోక్షంగా మరింత మరింత మంది జీవనోపాధి లభిస్తుందని అన్నారు.

పాకిస్తాన్ కారణంగా “సార్క్” (సౌత్ ఆసియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోపరేషన్) విజయవంతం కాలేకపోవచ్చేమోగానీ, భారత ప్రధాని నరేంద్ర మోది కృషి, ముందుచూపుతో “బిమ్ స్టెక్” (ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్, శ్రీలంక, థాయ్ లాండ్ ) దేశాల సమిట్ తో ప్రాంతీయ సంబంధాలు బలోపేతమవుతున్నాయని అన్నారు.

7 దక్షిణాసియా & ఆగ్నేయాసియా దేశాలకు శ్రేయస్సు & భద్రత కోసం బంగాళాఖాతాన్ని ఒక కనెక్టివిటీ వంతెనగా మార్చడానికి ప్రధాని మోది ప్రయత్నించడం గొప్ప విషయమని అన్నారు. బిమ్ స్టెక్ సెంటర్ ఫర్ వెదర్ & క్లైమేట్‌ను పునఃప్రారంభించేందుకు $3 మిలియన్లను ప్రధాని మోది ప్రకటించడం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఒక పెద్ద అడుగు పడిందని అన్నారు.

LEAVE A RESPONSE